Site icon HashtagU Telugu

Drink Milk: పాలు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 12 Jul 2024 08 56 Am 6029

Mixcollage 12 Jul 2024 08 56 Am 6029

ఉదయం లేవగానే చాలామందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే పాలు చాలా తక్కువ మంది మాత్రమే తాగుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు తల్లితండ్రులు పాలు తాగమని బలవంత పెడుతూ ఉన్నా కూడా పిల్లలు తాగడానికి అస్సలు ఇష్టపడరు. అయితే పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలలో ఉండే క్యాల్షియం ఎముకలను గట్టిపరుస్తుంది. అంతేకాకుండా తరచుగా పాలు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే పాలు తాగడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మరి పాలు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఇలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయట. అందుకు గల కారణం పాలల్లో ఉండే లాక్టోస్ ముఖ్యంగా డయేరియా, గ్యాస్, బ్లోటింగ్ , కడుపులో విపరీతమైన నొప్పి లాంటివి వస్తూ ఉంటాయట. అందుకే పాల అలర్జీ ఉన్నా లేకున్నా అతిగా పాలు తీసుకునే అలవాటు ఉన్నా వెంటనే ఆపేయాలి. ముఖ్యంగా స్త్రీలలో పాలు ఎక్కువగా తాగడం వల్ల మొటిమల సమస్యలు వస్తాయట. పాలల్లో ఉండే హార్మోన్లు ముఖంపై ఆయిల్ గ్లాండ్స, మొటిమల సమస్య ఏర్పడటానికి కారణం అవుతాయట.

కొందరిలో అయితే కిడ్నీల్లో రాళ్ల సమస్యగా కూడా మారే అవకాశం ఉందట. పాలు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్ల మాదిరిగా కూడా ఏర్పడనున్నాయట. పాలల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం మనకు ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడతాయి. కానీ ఎక్కువ పాలు తాగడం వల్ల అదనపు కాల్షియం కిడ్నీల్లోరాళ్లలా మారే ప్రమాదం ఉందట. ఇక పాలల్లో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా పాలు తాగడం వల్ల క్యాలరీ ఇన్ టేక్ ఎక్కువగా మారి అతిగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇది మాత్రమే కాదు మరీ ఎక్కువగా పాలు తాగితే గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి ఈ పాలు తాగడం మంచిదే కానీ అదిగా తాగితే మాత్రం పైన చెప్పిన సమస్యలు తప్పవు అంటున్నారు వైద్య నిపుణులు.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.