Site icon HashtagU Telugu

Tea and Coffee : రాత్రిపూట కాఫీ, టీ లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్తగా మీరు డేంజర్ లో పడ్డట్టే?

Mixcollage 24 Jan 2024 02 36 Pm 721

Mixcollage 24 Jan 2024 02 36 Pm 721

ఉదయం లేవగానే మనలో చాలామందికి టీ,కాఫీలు తాగే అలవాటు. కొందరు బ్రష్ చేసుకున్న తర్వాత తాగితే మరికొందరు బెడ్ కాఫీ, టీలు తాగుతూ ఉంటారు. అలా టీ, కాఫీలకు ఈ రోజుల్లో మనుషులు బాగా ఎడిక్ట్ అయిపోయారు. అయితే టీ, కాఫీలు తాగడం మంచిదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు తాగడం అస్సలు మంచిది కాదు. కొందరికి రాత్రిపూట కూడా టీ కాఫీ తాగే అలవాటు. మరి రాత్రి సమయంలో కాఫీలు టీలు తాగవచ్చా ఒకవేళ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..రాత్రిపూట టీ కాఫీలను అస్సలు తాగకూడదట. రాత్రిపూట టీ కాఫీలను తాగితే ఏమౌతుందో తెలిస్తే మీరు కూడా వెంటనే తాగడం మానేస్తారు. మాములుగా ఒక కప్పు కాఫీలో 150 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది.

ఒక కప్పు చాయ్ లో 150 మిల్లీ గ్రాముల టీఎన్ అనే మందు ఉంటుంది. నిజానికి కాఫీ కానీ టీ కానీ ఆహారం కాదు. అవి ఔషధాలు. కాఫీ, టీ లో ఉండే ఈ స్టిములెంట్స్ నరాల వ్యవస్థను ఉద్రేక పరుస్తాయి. అందుకే కాఫీ కానీ టీ కానీ తాగగానే రీఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. ఉత్సాహం వస్తుంది. అయితే ఈ స్టిములేషన ఒక గంట మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వెంటనే నరాల వ్యవస్థ బలహీనం అవుతుంది. అలా.. నరాల వ్యవస్థను అతిగా ఉద్రేక పరచడం ఆ తర్వాత ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల డిప్రెషన్ వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే టీ కాఫీలను ఎక్కువగా తాగకూడదు. అయితే రాత్రిపూట ముఖ్యంగా అస్సలు తాగకూడదు, రాత్రి పూట మన శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది.

ఇది కేవలం రాత్రి పూట మాత్రమే విడుదల అవుతుంది. ఈ హార్మోన్ రాత్రి పూట విడుదల అయితేనే నిద్ర వస్తుంది. బాడీ మొత్తం రిలాక్స్ స్టేజ్ లోకి వెళ్తుంది. ఒకవేళ రాత్రి పూట టీ కాఫీలు తాగితే నిద్ర రావడానికి ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల కాదు. దీని వల్ల మనకు నిద్ర పట్టదు. దాని వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. శరీరం రిలాక్స్ కాదు. దాని వల్ల భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి పూట అస్సలు టీ కాఫీలు తాగకూడదు. ఇంకా కావాలి అనుకుంటే రాత్రి సమయంలో పడుకునేటప్పుడు పాలు తాగి పడుకోవడం ఇంకా మంచిది.