Lemon Water: నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.. వేసవికాలంలో డిహైడ్రేషన్ కు గురైనప్పుడు, అలసటగా నీ

  • Written By:
  • Updated On - June 13, 2024 / 04:45 PM IST

నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.. వేసవికాలంలో డిహైడ్రేషన్ కు గురైనప్పుడు, అలసటగా నీరసంగా అనిపించినప్పుడు, వాంతులు, విరోచనాలు అవుతున్నప్పుడు ఈ నిమ్మకాయ నీరు తాగమని చెబుతూ ఉంటారు. ఈ నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది ఈ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటంటే నిమ్మకాయ మంచిదే కదా అని తరచుగా నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు.

ఎందుకంటే నిమ్మకాయ ఎక్కువగా తాగడం వల్ల కూడా శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. దీని వల్ల శరీరం నుంచి నీరు ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది కాకుండా, ఎలక్ట్రోలైట్స్, సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా శరీరంలోంచి వెళ్లిపోతాయి. ఇది కొన్నిసార్లు డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. అంతేకాదు నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది దంత క్షయానికి కూడా కారణం కావచ్చు.

ఇది దాని ఆమ్ల స్వభావం కారణంగా దంతాల సున్నితత్వాన్ని కలిగిస్తుంది. కాబట్టి శరీరాన్ని తాజాగా ఉంచుకోవడంతో పాటు దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం మంచిది. అలాగే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్‌తో పాటు ఆక్సలేట్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో క్రిస్టల్స్ రూపంలో పేరుకుపోవడం ప్రారంభం అవుతుంది. ఇది మూత్ర పిండాలలో రాళ్ల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. మీకు కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే, నిమ్మకాయ రసం తక్కువగా తీసుకోవటం మంచిది. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎసిడిటీ సమస్య మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అలాంటి వారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకపోవడమే మంచిది. నిమ్మకాయలో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎసిడిటీని పెంచుతుంది. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల సున్నితత్వం పెరిగి దంతాలపై రక్షించే ఎనామిల్ కూడా బలహీనపడుతుంది. దంతాల సున్నితత్వం ఉన్నవారు నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించకూడదు. నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం ఎముకలకు కూడా ప్రమాదకరం. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. దీన్ని తాగడం వల్ల ఎముకల్లో నిల్వ ఉన్న క్యాల్షియం వేగంగా కరిగిపోవడం ప్రారంభమవుతుంది. శరీరం నుండి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.