లెమన్ కి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో లెమన్ టీ తాగే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కాగా ఈ లెమన్ టీ బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం తెలిసిందే. బరువు తగ్గాలనుకునే వారు పొట్ట తగ్గించుకోవాలి అనుకున్నవారికి ఉదయాన్నే లెమన్ టీ తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
అయితే లెమన్ టీ మంచిదే కదా అని ఎక్కువగా తాగకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి లెమన్ టీ ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు లెమన్ టీ తాగడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తాగితే మాత్రం ఈ టీ లో ఉండే టానిన్ అనే పదార్థం ఎసిడిటీ సమస్యలను కలిగిస్తుంది. నిమ్మకాయలు కలిపిన టీ ని కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు పెరుగుతాయట. నిర్జలీకరణం అంటే శరీరంలోని నీటిని తగ్గించే పరిస్థితి. ఇంతకు ముందు చెప్పినట్టుగా లెమన్ టీ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది.
కాబట్టి ఇది నిర్జలీకరణానికి కూడా కారణమవుతుందట. అలాగే లెమన్ టీని క్రమం తప్పకుండా తాగితే దంతాల ఆరోగ్యం దెబ్బతింటుందట. ఇలాంటి ఆమ్ల పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దంతాల ఎనామెల్ దెబ్బతింటుందట. ఇది చివరికి దంత క్షయానికి కారణమవుతుందని, అలాగే నోటి ఆరోగ్యాన్ని మొత్తం ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. లెమన్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందట. లెమన్ టీ ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయని నిపుణులు చెబుతున్నారు.