Juice Empty Stomach: ఖాళీ కడుపుతో జ్యూసులు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

మనలో చాలా మంది ఉదయం అల్పాహారం మానేసి ఖాళీ కడుపుతో జ్యూస్ లు తాగుతుంటారు. తాజా పండ్ల రసం రుచికరమైనది, అలాగే అందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడు

  • Written By:
  • Publish Date - July 5, 2024 / 06:27 PM IST

మనలో చాలా మంది ఉదయం అల్పాహారం మానేసి ఖాళీ కడుపుతో జ్యూస్ లు తాగుతుంటారు. తాజా పండ్ల రసం రుచికరమైనది, అలాగే అందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో జ్యూస్ లను తీసుకుంటే ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్‌లను తీసుకోవడం వల్ల పండ్ల రసంలో ఉండే ఆమ్లం దంతాల ఎనామెల్ ను క్షీణింపజేస్తుంది.

అంతేకాకుండా దీని వల్ల పళ్ళు కూడా సున్నితంగా మారతాయి. ఉదయం ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకోవడం వల్ల పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల ఫైబర్ శరీరానికి అందక మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు పండ్ల రసాలను ఉదయం తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడేవారు కాదు కడుపుతో ఎట్టి పరిస్థితులలో జ్యూస్ తాగకూడదట. ఇలా తాగితే అందులో ఉండే కేలరీలు బరువును పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం జ్యూస్‌ తాగడం అస్సలు మంచిది కాదు.

ఖాళీ కడుపుతో జ్యూస్‌ తాగడం వల్ల అసిడిటీ, కడుపు నొప్పి, వికారం, వాంతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఖాళీ కడుపుతో జ్యూస్‌ తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. జ్యూస్ లలో పోషకాలు తక్కువగా ఉంటాయి. పండ్లు లేదా కూరగాయలు తినడం వల్ల లభించే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు జ్యూస్ లో అంతగా ఉండవు. ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల శరీరం ఈ పోషకాలను సరిగ్గా శోషించుకోలేకపోతుంది. అయితే ఖాళీ కడుపుతో జ్యూస్‌ బదులుగా నీళ్ళు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అలాగే రాత్రంతా నిద్రపోయిన తర్వాత, శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అలాంటప్పుడు ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల శరీరానికి తగినంత నీరు అందుతుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి.

నీరు మూత్రపిండాలకు సహాయపడి, శరీరంలోని విషాలను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల జీర్ణ అగ్ని ప్రేరేపించబడుతుంద. అలాగే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల మలబద్ధకం రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. చాలా జ్యూస్‌ లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దంత సమస్యలకు దారితీస్తుంది.
కాగా జ్యూస్‌ లో నీటి శాతం తక్కువగా ఉంటుంది, ఖాళీ కడుపుతో హైడ్రేషన్ కోసం నీరే మంచి ఎంపిక అని చెప్పవచ్చు. కాగా జ్యూస్ తయారీ సమయంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు నశించే అవకాశం ఉంది.