Side Effects: వామ్మో.. ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల అన్ని నష్టాల?

ప్రతి ఒక్కరి వంటింట్లో దొరికే కూరగాయలలో బీట్రూట్ కూడా ఒకటి. బీట్రూట్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే

  • Written By:
  • Publish Date - July 14, 2023 / 10:10 PM IST

ప్రతి ఒక్కరి వంటింట్లో దొరికే కూరగాయలలో బీట్రూట్ కూడా ఒకటి. బీట్రూట్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. బీట్రూట్ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బీట్రూట్ ని తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుంది. బీట్‌రూట్ రసం విటమిన్లు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ అద్భుతమైన మూలం, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది, హిమోగ్లోబిన్ స్థాయిలను కణాలకు ఆక్సిజన్ పంపిణీని పెంచుతుంది. దుంపలలో ఐరన్ ఉండటం వల్ల శరీరంలో రక్త కొరతను తీర్చడానికి దుంపలను తినమని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు. అయితే మరి బీట్రూట్ జ్యూస్ ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శరీరం లో ట్రై గ్లిజరాయిడ్ల శాతం తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ట్రై గ్లిజరాయిడ్లు తగ్గటం వల్ల రక్తంలోని కొవ్వు కూడా తగ్గుతుంది.శరీరంలో సహజంగా హార్మోనులు ఉత్పత్తి కావడానికి బీట్ రూట్ సహకరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అనేక రకాల వ్యాధుల నివారణ లో బీట్ రూట్ ని వాడతారు. బీట్ రూట్ అధ్భుతంగా ఉన్నా మన ఆరోగ్యానికి మెలే చెయ్యాలన్న నియమం లేదు. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బీట్ రూట్ దుంపలు తిన్న తర్వాత ఎరుపు లేదా గులాబీ రంగులో ఉండే మూత్రాన్ని బిటురియా అంటారు. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.. ఈ దుంపలలో ఆక్సలేట్లు పుష్కలంగా ఉంటాయి.

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఒక కారణం కావచ్చు. దుంపలు మూత్ర ఆక్సలేట్ విసర్జనను పెంచుతాయి..ఇది శరీరంలో కాల్షియం ఆక్సలేట్ రాళ్ల అభివృద్ధికి దారితీస్తుంది. అందువల్ల, కిడ్నీలో రాళ్లతో బాధపడే వారు దుంపలు లేదా దుంప రసం తీసుకోవడం మానేయాలని వైద్యులు సలహా ఇస్తారు. అనాఫిలాక్సిస్ బీట్‌రూట్ ఎక్కువగా తినడం వల్ల అనాఫిలాక్సిస్ వస్తుంది. దీని ఫలితంగా శరీరంలో తీవ్రమైన అలెర్జీ సంభవించవచ్చు. ఎర్రటి చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, గురక, దద్దుర్లు, గొంతు నొప్పి మరియు బ్రోంకోస్పాస్మ్ కూడా సంభవించవచ్చు. గర్భధారణ సమయంలో సమస్యలు దుంపలలో నైట్రేట్ల ఉనికి గర్భిణీ స్త్రీలకు చాలా హానికరం. గర్భధారణ సమయంలో నైట్రేట్ అధికంగా తీసుకోవడం వల్ల శక్తి లోపించడం, తలనొప్పి, కళ్లు తిరగడం కళ్లు, నోరు, పెదవులు, చేతులు మరియు పాదాల చుట్టూ చర్మం నీలం-బూడిద రంగులోకి మారడం వంటి వాటికి కారణమవుతుంది.