Site icon HashtagU Telugu

Drink Beer: ప్రతీరోజు బీర్ తాగుతున్నారా.. అయితే మీకు ఆ సమస్యలు రావడం ఖాయం!

Mixcollage 22 Jul 2024 05 52 Pm 9890

Mixcollage 22 Jul 2024 05 52 Pm 9890

మనలో చాలామందికి ప్రతిరోజు ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది. కొందరు ఎప్పుడో ఒకసారి తాగితే మరికొందరు ప్రతిరోజు తాగుతూ ఉంటారు. కొందరు మందు సేవిస్తే మరికొందరు బీరు తాగుతూ ఉంటారు. మీరు కూడా అలా ప్రతిరోజు బీరు తాగుతున్నారా. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. బీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ అలా అని ఎక్కువగా తాగడం అస్సలు మంచిది కాదు. అప్పుడప్పుడు తాగడం వల్ల పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ దీన్ని రోజూ తాగడం అలవాటు చేసుకుంటేనే లేని పోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

బీర్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బీర్ ను తాగేటప్పుడు చాలా మంది కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే వాటినే తింటుంటారు. దాంతో ఈ అలవాటు మీరు బరువు పెరగడానికి దారితీస్తుందట. అలాగే ఆల్కహాల్ కూడా మీ ఆకలిని బాగా పెంచుతుందట. అలాగే చెడు ఆహారాలను తినే అలవాటు అవుతుందని, ఇది క్రమంగా మిమ్మల్ని ఊబకాయం బారిన పడేలా చేస్తుందని చెబుతున్నారు. అలాగే శరీరానికి హాని కలిగించే ఉప ఉత్పత్తులుగా ఇది విచ్ఛిన్నం చేస్తుందట. అయితే మీరు రోజూ ఆల్కహాల్ ను రోజూ తాగితే కాలేయ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ముఖ్యంగా కాలేయ మంట, కొవ్వు కాలేయ వ్యాధితో పాటుగా, సిరోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అలాగే కాలెయ పని సామర్థ్యం కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు. దీంతో మీ శరీర ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ అభిజ్ఞా పనితీరును కూడా ప్రభావితం చేస్తుందట. బీర్ ను ఎక్కువగా తాగితే మీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సామర్థ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. అలాగే ప్రతిరోజు బీరు తాగితే మతిమరుపు సమస్య కూడా వస్తుందట. అలాగే బీరు ఎక్కువ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయట. బీర్ ను తాగడం వల్ల మీ రక్తపోటు పెరుగుతుందట. అలాగే ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయట. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా బాగా పెరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి బీరు తాగడం మంచిదే కానీ అలా అని ప్రతిరోజు ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.

Exit mobile version