Site icon HashtagU Telugu

Coconut Water Side Effects: వేసవిలో కొబ్బరినీళ్లు మంచివే కానీ.. మితిమీరి తాగితే మాత్రం సమస్యలు తప్పవు?

Coconut Water Side Effects

Coconut Water Side Effects

కొబ్బరి నీళ్ల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొబ్బరి నీళ్ల వల్ల ఎన్నో సమస్యలు కూడా నయమవుతాయి. అందుకే కొబ్బరి నీటిని మ్యాజిక్ డ్రింక్ లేదంటే నేచర్ డ్రింక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నీరసంగా అనిపించినప్పుడు వాంతులు విరోచనాలు అయినప్పుడు కొబ్బరి నీటిని తాగాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అలాగే వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండవచ్చు. అందుకే వేసవిలో డాక్టర్లు ఎక్కువగా కొబ్బరి నీటిని తాగమని చెప్తూ ఉంటారు.

కొబ్బరి నీరు తాగడం మంచిదే కానీ అలా అని మితిమీరు తాగితే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. మరి కొబ్బరి నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం… కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పై లగ్జేటివ్ ప్రభావం పడుతుంది. కొబ్బరి నీరు సహజ భేది మందు కాబట్టి ప్రేగు కదలికల్లో సమస్యలు వస్తాయి. దీని వల్ల డయేరియా రావచ్చు. వర్కవుట్స్ చేసే వారు హైడ్రేటెడ్ గా ఉండటానికి కొబ్బరి నీటిని తాగకూడదు. దానికి బదులు మంచి నీటిని తాగాలి. కొబ్బరి నీటిలో సోడియం తక్కువగా ఉంటుంది.

అలాగే కొన్ని స్పోర్ట్స్ ఎనర్జీ డ్రింక్స్ తో పోలిస్తే కొబ్బరి నీటిలో కార్బొహైడ్రేట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. రాత్రి పూట కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర పెరుగుతుంది. మూత్రవిసర్జన పెరుగుతుంది. రాత్రి పూట బాత్రూముకు నిరంతరం వెళ్లాల్సి వస్తుంది. దాంతో పాటు నిద్రకు కూడా భంగం కలుగుతుంది. కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అయితే పొటాషియం ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవడంవల్ల హైపర్ కలేమియా ఏర్పడి స్పృహ కోల్పోవచ్చు. కాబట్టి కొబ్బరి నీళ్లు మంచిదే కానీ మితిమీరి తాగడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.

Exit mobile version