ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అయితే వేసవికాలంలో ఎన్ని ఫ్యాన్లు ఉన్నా సరిపోదు. గాలి ఎక్కువగా వీచినా కూడా వేడిగా వేస్తూ ఉంటుంది. అందుకే చాలామంది కరెంటు బిల్లుతో పని లేకుండా ఏసీ ఉపయోగిస్తూ ఉంటారు. వేసవికాలం అయిపోయే వరకు రాత్రి పగలు ఏసీల కింద గడిపేస్తూ ఉంటారు. మధ్యాహ్న సమయంలో ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ని ఇంకా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఏసీ ఉన్నంత సేపు మంచిగానే ఉంటుంది కానీ అలా ఎక్కువసేపు ఏసీలో ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
మరి ఏసీలో ఎక్కువసేపు ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఏసీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కాలుష్యం పెరగడం మాత్రమే కాకుండా మన ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందట. AC అంటే ఎయిర్ కండీషనర్ గాలి నుండి తేమను తొలగిస్తుందట. తద్వారా చుట్టు పక్కల గాలిని పొడిగా చేస్తుంది. అయితే ఇది మీ కళ్ళు పొడిగా చేస్తుందట. అలాగే చికాకు కలిగిస్తుందట. ఎయిర్ కండిషనర్ ఆన్ చేసినప్పుడు గది చల్లగా మారేందుకు కిటికీలు , తలుపులు సాధారణంగా మూసివేస్తారు.
దాంతో స్వచ్ఛమైన గాలి అందుబాటులో ఉండదు. ఎక్కువసేపు స్వచ్ఛమైన గాలి మన శరీరానికి తగలకపోతే మన ఒంటికి బద్ధకం, అలసట వచ్చి చేరతాయట. ఒకవేళ మీరు ఇప్పటికే అలర్జీలు లేదా ఆస్తమాతో బాధపడుతుంటే, ఏసీ మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందట. గదిలో ఎయిర్ కండీషనర్ ఉంటే చుట్టుపక్కల స్వచ్ఛమైన గాలి లేకపోవడం వల్ల అలర్జీలు, ఆస్తమా వచ్చే అవకాశం ఉందట. మీరు ఎక్కువ సేపు ఎయిర్ కండిషన్డ్ ప్రదేశంలో ఉండి, ఆపై ఎండలో బయటికి వెళితే, మీ చర్మం త్వరగా పొడిబారి, దురద సమస్యలను కలిగిస్తుందట. చర్మం కూడా పొడిగా మారుతుందని చెబుతున్నారు. అదేవిధంగా చాలా కాలం పాటు ఎయిర్ కండిషన్డ్ ప్రదేశం కూడా మీకు శ్వాస సమస్యలను కలిగిస్తుందట. నిజానికి ఏసీ ఆన్ చేస్తే స్వచ్ఛమైన గాలి అందకుండా అక్కడ కిటికీలు, తలుపులు మూసేస్తారు. దీంతో శ్వాస సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు.