Site icon HashtagU Telugu

Pineapple: బాబోయ్.. పైనాపిల్ తింటే ఇన్ని రకాల సమస్యలు వస్తాయా.. అవేంటంటే?

Pineapple

Pineapple

రుచికరమైన పండ్లలో పైనాపిల్ ఒకటి. ఈ పైనాపిల్ పండును చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. ఇది తినడానికి తీయ్యగా, పుల్లని రుచి కలిగి ఉంటుంది. ఈ పండులో అధిక మొత్తంలో పొటాషియం, సోడియం, విటమిన్స్ లాంటి పోషకాలు లభిస్తాయి. పైనాపిల్ ను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు. పైనాపిల్‌లో సి విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఇది హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. అయితే చాలామంది పైనాపిల్ ను ఇష్టపడి తింటూ ఉంటారు.

అయితే పైనాపిల్ ను మితిమీరి తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. పైనాపిల్ ను ఎక్కువగా తినడం వల్ల అందులో ఉండే విటమిన్ సి శరీరంలో ఎక్కువ అయ్యి వాంతులు, గుండెల్లో మంట, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు పైనాపిల్ ని ఎక్కువగా తినకూడదు. పైనాపిల్ లో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల దాన్ని మధుమేహం ఉన్నవారు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలో పెరుగుతాయి. అలాగే పైనాపిల్ దంతాల ఆరోగ్యానికి కూడా దెబ్బతీస్తాయి.

మోతాదుకు మించి తింటే దంతాల సున్నితత్వం దెబ్బతింటుంది. అంతేకాకుండా కావిటీ సమస్యలు కూడా తలెత్తవచ్చు. అందుకే దంత సమస్యలు ఉన్నవారు పైనాపిల్ ను తీసుకోకపోవడమే బెటర్. అలాగే పైనాపిల్ ను మోతాదుకు మించి తింటే గొంతు నొప్పి సమస్యతో పాటుగా అలెర్జీ సమస్య కూడా రావచ్చు. అలాగే కొన్ని రకాల అలర్జీ సమస్యలు ఉన్నవారు పైనాపిల్ ని దానికి ముందు వైద్యున్ని సంప్రదించడం ఎంతో మంచిది. పైనాపిల్ తింటే గర్భస్రావమయ్యే ప్రమాదముంది. గర్భం దాల్చిన మహిళలు పైనాపిల్ కు దూరంగా ఉండటం మంచిది. నెలలు నిండే కొద్ది ప్రమాద స్థాయి తగ్గుతుంది కాబట్టి తరువాతి నెలలలో ఎటువంటి భయం లేకుండా పైనాపిల్ ను తినవచ్చు.

Exit mobile version