Site icon HashtagU Telugu

Sleep: మీరు కూడా దుప్పటి కప్పుకుని నిద్ర‌పోతున్నారా?

Sleep

Sleep

Sleep: ఈ చలికాలంలో ఒంటి నిండి దుప్ప‌టి క‌ప్పుకుని పడుకోవడంలో (Sleep) చాలా మందికి మంచి అనుభూతి లభిస్తుంది. దుప్పటిలో పూర్తిగా చుట్టుకుని పడుకుంటే నిద్ర బాగా పడుతుంది. కానీ ఇది కొన్నిసార్లు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా? అవును నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలా చేయడం వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. ఎందుకంటే నోరు, ముఖం కప్పి ఉంచడం వలన శరీరానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందదు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి చలి నుండి రక్షించుకోవడానికి సరైన పద్ధతిలో నిద్రించడం ఎంత ముఖ్యమో తెలుసుకోవడం చాలా అవసరం. నిపుణుల ప్రకారం.. సరిగ్గా నిద్రించడానికి సరైన మార్గం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: India Loses Toss: టీమిండియా ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

దుప్ప‌టి కప్పుకుని పడుకోవడం వల్ల కలిగే ప్రభావాలు ఏంటి?

ఆక్సిజన్ స్థాయి తగ్గడం: మీరు చలి నుండి రక్షించుకోవడానికి ముఖంతో పాటు గదిని కూడా మూసివేసి నిద్రిస్తున్నట్లయితే అలా చేయకండి. ఎందుకంటే ఇది గదిలో ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుంది. నిద్రపోయేటప్పుడు మీకు ఇబ్బంది కలగవచ్చు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: ఎక్కువ కాలం ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడవచ్చు. చాలాసార్లు స్వచ్ఛమైన గాలి లోపలికి రాలేకపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఒకే దుప్పటిలో ఇద్దరు వ్యక్తులు నిద్రిస్తున్నప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది.

మొటిమల సమస్య: గాలి తగలకపోవడం వలన దుప్పటి లోపల తేమ పెరుగుతుంది. దీనివల్ల చర్మం జిగటగా మారుతుంది. ఇది కొన్నిసార్లు మొటిమల సమస్యకు దారితీయవచ్చు.

నిద్రించడానికి సరైన మార్గం ఏమిటి?

దుస్తులు: చలిలో నిద్రించడానికి సరైన మార్గం ఏమిటంటే.. మొదటగా ఆరాం దాయకమైన దుస్తులు ధరించడం. ఎందుకంటే మరీ లావుగా ఉండే దుస్తుల్లో మంచి నిద్ర పట్టదు.

ఎడమవైపుకు తిరిగి పడుకోవడం: సైన్స్ ప్రకారం.. ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం మంచిది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గురక కూడా తగ్గుతుంది.

తల ఎత్తుగా ఉంచడం: నిద్రపోయేటప్పుడు తలను కొద్దిగా ఎత్తుగా ఉంచి, దిండును మెడ దగ్గర పెట్టుకోవాలి. తద్వారా శ్వాస తీసుకోవడం సులభమవుతుంది.

దుప్పటి ఛాతీ వరకు మాత్రమే: దుప్పటిని ఛాతీ వరకు మాత్రమే కప్పుకోవడం మంచిది. ఒకవేళ మీరు ముఖాన్ని కప్పుకోవాలనుకుంటే మరీ బరువైన దుప్పటిని ఉపయోగించవద్దు.

గాలి ప్రసరణ: గదిలోకి బయటి నుండి కొద్దిగా గాలి వచ్చేలా మార్గం ఉంచండి. తద్వారా కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్లిపోతుంది.

 

 

Exit mobile version