Site icon HashtagU Telugu

Walk: భోజనం తర్వాత నడవాలా.. వద్దా? నిపుణుల స‌మాధానం ఇదే!

Walk

Walk

Walk: నడవడం ఆరోగ్యానికి మంచిది. కానీ దీన్ని ఎప్పుడు చేయాలనే విషయంపై సమాచారం తెలుసుకోవడం కూడా ముఖ్యం. సాధారణంగా ఉదయం సమయంలో ప్రతి ఒక్కరూ నడవడానికి (Walk) వెళ్లాలి. కానీ భోజనం తర్వాత కూడా నడవాలా? విభిన్న సలహాల కారణంగా చాలా మంది గందరగోళానికి గురవుతారు. భోజనం తర్వాత నడవడం గురించి మీరు వివిధ రకాల అభిప్రాయాలు విని ఉంటారు. కొందరు భోజనం తర్వాత నడవడం మంచిదని భావిస్తూ, భోజనం చేసిన వెంటనే నడవడానికి బయలుదేరతారు.

అయితే మరికొందరు దీన్ని నివారించాలని సూచిస్తారు. చాలా మంది భోజనం తర్వాత నడవకూడదని నమ్ముతారు. ఈ సందర్భంలో ప‌లువురు వైద్యులు భోజనం తర్వాత నడవాలా వద్దా అనే విషయాన్ని వివరించారు.

భోజనం తర్వాత నడవాలా? వద్దా?

వైద్యులు చెప్పిన ప్రకారం.. భోజనం తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు నడవడం అవసరమని చెప్పారు. భోజనం తర్వాత నడక మీ జీర్ణవ్యవస్థను సరిగ్గా ఉంచడానికి, షుగర్ మెటబాలిజంలో సహాయపడుతుంది. మీరు భోజనం తర్వాత నడిస్తే షుగర్ స్థాయిలు హఠాత్తుగా పెరిగే ప్రమాదం తగ్గుతుంది. భోజనం తర్వాత నడక వల్ల మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, ఈ నడక సరైన రీతిలో ఉండాలి.

Also Read: D4 Anti-Drone System: డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్‌.. భార‌త్ నుంచి కొనుగోలుకు సిద్ధ‌మైన తైవాన్!

భోజనం తర్వాత నడక ఎలా ఉండాలి?

భోజనం తర్వాత నడక తేలికగా, ఇంట్లో చేసే విధంగా ఉండాలి. అదే సమయంలో ఈ నడక 10 నుండి 15 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు.

బ్రిస్క్ వాక్ ఎప్పుడు చేయాలి?

మీరు బ్రిస్క్ వాకింగ్ చేయాలనుకుంటే భోజనం- నడక మధ్య కనీసం 1.5 గంటల వ్యవధి ఉండాలి. మీరు ఈ వ్యవధిని పాటించకపోతే జీర్ణక్రియ దెబ్బతినవచ్చు. ప్రత్యేకించి మీకు ఇప్పటికే కడుపు సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే ఈ వాక్‌ను పాటించ‌క‌పోవ‌డం ఉత్త‌మం.