Oversalted foods : ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపించినప్పుడు లేదా ఏదైనా పని చేస్తుండగా అల్లరి చిల్లరగా చిప్స్ తింటుంటాం. కానీ ఆ రుచిని మించిన ప్రమాదం పొంచి ఉంటుందని ఎప్పుడైనా గమనించారా? చిప్స్‌లోని ఉప్పు మన శరీరానికి చాలా అవసరం.అయితే అతిగా తినడం వలన అది విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. రోజులో పరిమితికి మించి ఉప్పును తీసుకుంటే జుట్టు రాలడం అనేది ఒక సమస్య. ఉప్పు వల్ల జుట్టు రాలడం అనేది నేరుగా జరగదు.అయితే, ఉప్పు అధికంగా తీసుకుంటే శరీరంలో డీహైడ్రేషన్ పెరిగిపోతుంది. దీని వల్ల జుట్టు కుదుళ్లకు అందాల్సిన పోషకాలు అందక అవి బలహీనంగా మారతాయి. ఫలితంగా జుట్టు రాలిపోతుంది.అంతేకాకుండా ఉప్పును అధికంగా తీసుకుంటే మన తల చర్మం పొడిగా మారే అవకాశం ఉంది.దీంతో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.
TG High Court : కేసీఆర్, హరీశ్ రావులకు ఊరట..కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్టు
అధిక రక్తపోటు పెరిగే అవకాశం
ఉప్పును అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. అధిక సోడియం కారణంగా రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. సోడియం అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీని వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరిగిపోతుంది. అధిక రక్తపోటును నియంత్రించకపోతే కిడ్నీ సమస్యలు, కంటి చూపు మసకబారడం, నాడీ వ్యవస్థ సమస్యలు వంటివి వచ్చే అవకాశం ఉంది.
కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం
ఉప్పును ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. మన కిడ్నీలు శరీరంలోని ఉప్పు, ఇతర వ్యర్థాలను ఫిల్టర్ చేస్తాయి. అయితే అధికంగా ఉప్పు తినడం వల్ల కిడ్నీలపై భారం పెరుగుతుంది. ఇలా ఎక్కువ రోజులు ఉంటే కిడ్నీ పనితీరు తగ్గిపోయి కిడ్నీ స్టోన్స్ ఏర్పడవచ్చు. అలాగే మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశం కూడా ఉంది. ఇవి శరీరంలోని నీటి శాతం, రక్తపోటును సమతుల్యం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమతుల్యత దెబ్బతింటుంది.
శరీరంలోని వాటర్ లెవల్స్ తగ్గిపోవడం
అధిక ఉప్పు తీసుకోవడం వల్ల శరీరం నీటి శాతం కోల్పోతుంది.దీనినే డీహైడ్రేషన్ అని అంటారు. శరీరంలోని కణాలు వాటి సాధారణ పనితీరును కొనసాగించడానికి సరిపడా నీటిని కోల్పోతాయి. దీని వల్ల తీవ్రమైన దాహం, అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారడం, పెదవులు పగలడం కూడా జరుగుతుంది. డీహైడ్రేషన్ వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. అధిక ఉప్పు చిప్స్ తినే అలవాటు ఉన్నవారికి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చిప్స్, ఇతర ఉప్పు పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఒక్క జుట్టు రాలడమే కాదు.ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. గుండె సమస్యలు, కిడ్నీలు దెబ్బతినడం, డీహైడ్రేషన్ వంటివి కూడా కలుగుతాయి. అందువల్ల ఉప్పును పరిమితికి మించి వాడకూడదు. దాని బదులు పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి వాటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.కాబట్టి ఉప్పు పదార్థాలు ఎక్కువగా తినే అలవాటు ఉంటే వెంటనే మానేయడం మంచిది.మీ ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించండి.
Shocking Video : ఓనం వేడుకలో డ్యాన్స్ కుప్పకూలి ఉద్యోగి మృతి