ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమయంలో కష్టాలు రావడం అన్నది సహజం. అయితే కొన్ని కష్టాలను ఏరి కోరి మరి వారి చేజేతులా తెచ్చుకుంటూ ఉంటారు. కష్టాలను తెచ్చుకోవడం అంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే అందుకు కారణం అంటున్నారు పండితులు. జీవితంలో ఎదుర్కొనే కొన్ని రకాల సమస్యలకు గ్రహాల ప్రభావం కూడా కారణం అన్న విషయం తెలిసిందే. ఒకవేళ మీరు కనుక తరచుగా ఏదో ఒక రకమైన సమస్యలతో బాధపడుతున్నట్లయితే వీటన్నింటికీ ప్రధాన కారణం జాతకంలో శనీశ్వరుడు, రాహు, కేతు గ్రహాలు అశోక స్థానంలో ఉండడమే అని చెప్పాలి.
జాతకంలో ఈ మూడు గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయట. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహాల అశుభ ప్రభావం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయట. అంతేకాకుండా జీవితం మొత్తం సమస్యల మయంగా మారుతుందని చెబుతున్నారు. రాహు కేతు శని గ్రహాలు జాతకంలో అశుభ స్థానంలో ఉంటే, ఈ దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందడానికి వేప చెట్టు రెమిడి ఎంతగానో సహాయపడుతుందట. అంతేకాకుండా ఈ చెట్టును సరైన దిశలో నాటడం వల్ల కూడా గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
కాగా హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కొంతమంది వేప చెట్టుని గ్రామ దేవతగా, ఎల్లమ్మ తల్లిగా భావించి పూజించేవారు కూడా ఉన్నారు. వేప చెట్టు ఏలినాటి శనితో బాధపడుతున్న వారికి ఎంతగానో సహాయపడుతుందట. శని కుజుల శాపం నుంచి కూడా వేప చెట్టు విముక్తి కలిగిస్తుందట. వేప చెట్టును కుజ, శని, కేతువు గ్రహ ప్రభావాలతో బాధపడుతున్న వారు ఇంటికి దర్శనం దిక్కున నాటడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారట. అంతేకాకుండా గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. వేప చెట్టును నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. కొన్ని రాష్ట్రాల్లో వేపచెట్టును లక్ష్మీదేవిగా పూజిస్తారట. అయితే ఈ వేప చెట్టు ఇంటి ముందు ఉండడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. వేప చెట్టును ఎప్పుడైనా పూజించవచ్చు అని చెబుతున్నారు.