Site icon HashtagU Telugu

Brain Health : మెదడును చురుగ్గా ఉంచే 7 చిట్కాలు.. ట్రై చేయండి

Silent Brain Strokes

Silent Brain Strokes

Brain Health : యావత్ ప్రపంచం టెక్నాలజీ వెంట పరిగెడుతోంది. పెద్ద పెద్ద జీతాలు.. ఆ జీతాలకు తగ్గట్టే మెంటల్ ప్రెషర్ ఉంటుంది. మెదడుపై ఒత్తిడి ఎక్కువైతే.. త్వరగా మతిమరుపు, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ బిజీ బిజీ లైఫ్ లో మెదడుపై ఒత్తిడి పడకుండా చూసుకోవడం అంత తేలికైన పని కాదు. అందుకే మెదడుపై అధికంగా ఒత్తిడి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కంటినిండా నిద్రపోవడం చాలా ముఖ్యం. అలాగే కంటి ఆరోగ్యాన్ని కాపాడే ఆకుకూరలు ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి. ఈ ఏడు చిట్కాలతో మెదడు పై ఒత్తిడి పడకుండా.. మెదడు పనితీరు మెరుగయ్యేలా చేసుకోవచ్చు.

1. మెంటల్ గా యాక్టివ్ గా ఉండాలి. మెదడు యాక్టివ్ గా పనిచేయాలంటే.. తరచూ పజిల్స్ చేస్తూ ఉండాలి. అలాగే కొత్త భాషలను నేర్చుకుంటూ ఉండాలి.

2. మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. శారీరక వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం ద్వారా రక్తసరఫరా మెరుగై.. మెదడుపై దీర్ఘకాలిక ఒత్తిడి పడకుండా ఉంటుంది. మెదడు నరకాల పనితీరు మరింత మెరుగవుతుంది.

3.బ్రెయిన్ చురుగ్గా పనిచేసేందుకు అవసరమయ్యే ఆహారాలను ఎక్కువగా తినాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినాలి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభించే చేపలు, నట్స్ ను తరచూ ఆహారంగా తీసుకుంటూ ఉండాలి.

4. పనిపూర్తయ్యాక.. మెదడు కావలసినంత రెస్ట్ ఇవ్వాలి. అంటే రాత్రిళ్లు కనీసం 7-9 గంటల పాటు నిద్రపోవాలి.

5. స్ట్రెస్ మేనేజ్ మెంట్ : శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం మెడిటేషన్ చేయడం, డీప్ బ్రీతింగ్ తీసుకోవడం, యోగా చేయడం వంటివి చేస్తుండాలి.

6. ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం కూడా ప్రమాదకరమే. స్నేహితులతో, ఇతరులతో మాట్లాడుతూ ఉంటే కొత్త విషయాలు తెలుస్తుంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి.. మెదడును మరింత చురుగ్గా ఉంచుతుంది.

7. పుస్తకాలను ఎక్కువగా చదవడం అలవాటు చేసుకోవాలి. ఇది మనలో స్కిల్స్ ను పెంచడంతో పాటు.. జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. మన మెదడు పనితీరుపై, మెదడు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మెదడు ఆరోగ్యంపై వీలైనంత శ్రద్ధతీసుకోవడం మంచిది.