Site icon HashtagU Telugu

Semiya Pulihora : సేమియాతో ఒక్కసారి ఇలా నిమ్మకాయ పులిహోర ట్రై చేయండి

semiya pulihora

semiya pulihora

Semiya Pulihora : పులిహోర అనగానే.. ఎవరికైనా నోరూరిపోవడం ఖాయం. చింతపండు, నిమ్మకాయ పులిహోరతో పాటు.. మామిడికాయతో కూడా పులిహోర చేస్తుంటారు. కేవలం అన్నంతోనే కాదు.. బియ్యపురవ్వతో కూడా పులిహోర తయారు చేస్తారు. కానీ.. సేమియాతో ఎప్పుడైనా పులిహోర తయారు చేశారా ? ఒక్కసారి చేసి చూడండి. మళ్లీ మళ్లీ ఆ టేస్టే కావాలని లొట్టలేసుకుంటూ తింటారు. దీనిని అల్పాహారంగా, లైట్ డిన్నర్ గా కూడా తినచ్చు. సేమియా పులిహోర చేయడం చాలా సులభం. ఈ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం.

సేమియా నిమ్మకాయ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు

వాటర్ – 1 లీటర్
సేమియా – 1 కప్పు
నూనె – 2-3 టీ స్పూన్స్
శనగపప్పు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2
జీడిపప్పు – 10-15
తరిగిన పచ్చిమిర్చి – 3
కరివేపాకు – 1 రెమ్మ
ఉప్పు – తగినంత
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
నిమ్మకాయ – 1

సేమియా నిమ్మకాయ పులిహోర తయారీ విధానం

ఒక గిన్నెలో నీటిని తీసుకుని.. అందులో ఉప్పు, పసుపు, నూనె వేసి వేడి చేయాలి. ఈ నీరు మరిగిన తర్వాత అందులో సేమియా వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత సేమియాను వడకట్టి చల్లటినీళ్లు పోసుకోవాలి. నీరంతా పోయేలా పక్కకు వంచి పెట్టుకోవాలి.

ఇప్పుడు కళాయిలో నూనె వేసి.. అది వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఎండుమిర్చి, జీడిపప్పు వేసి వేయించాక, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత సేమియా వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఉప్పు, కొత్తిమీర వేసి మరోసారి కలుపుకున్నాక.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పులిహోర రెడీ.

 

Exit mobile version