Anti Diabetic Plant : ‘గుర్మార్’ అనే మొక్క గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. దీన్నే ‘జిమ్నేమా సిల్వెస్ట్రే’ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలో(Anti Diabetic Plant) మధుమేహాన్ని తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
షుగర్ వ్యాధి చికిత్స కోసం వినియోగించే ‘బీజీఆర్-34’ అనే ఔషధ తయారీకి గుర్మార్ మొక్కను శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్) పరిశోధకులు ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో జిమ్నెమిక్ యాసిడ్ ఉంది. ఇది పేగులోని పొరపై ఉండే గ్రాహక ప్రదేశాలను నింపేయడం వల్ల తీపి పదార్థాలను తినాలన్న కోరిక తగ్గిపోతుంది. పర్యవసానంగా రక్తంలో షుగర్ లెవల్ తగ్గుతుంది. బిహార్‌లోని గయలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై శాస్త్రవేత్తలు పిథెసెలోబియం డుల్సే, జిజుఫస్ జుజుబా వంటి అనేక ఔషధ మొక్కలను కనుగొన్నారు. వాటిలోనే గుర్మార్ మొక్క కూడా ఉంది. ఈ అన్ని రకాల మొక్కలలోని ఔషధ గుణాలపై ఇంకా రీసెర్చ్ కొనసాగుతోంది. ఈ పర్వతంపై కనిపించిన వనమూలికలను స్థానికుల సాయంతో పెద్దఎత్తున సాగు చేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read :Bhanu Saptami : ఇవాళ భానుసప్తమి.. ప్రత్యేక పూజలతో శుభ ఫలితాలు
డయాబెటిస్ అనేది జీవితకాలం పాటు వేధిస్తుంది. ఏటా లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే రిస్క్ చుట్టుముడుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది డయాబెటిస్‌తో జీవిస్తున్నట్లు అంచనా. జీవనశైలిలో మార్పులతో షుగర్ వ్యాధిని నివారించవచ్చు. తినే ఫుడ్‌లోని కార్బోహైడ్రేట్లను మన శరీరంలోని జీర్ణవ్యవస్థ గ్లూకోజ్‌లుగా విడగొడుతుంది. క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ హార్మోన్, శక్తిని విడుదల చేయడానికి ఈ గ్లూకోజ్‌ను గ్రహించాలని శరీర కణాలను ఆదేశిస్తుంది. అయితే మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు డయాబెటిస్ సమస్య దరిచేరుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడంతో శరీరంలో చక్కెర పోగుపడి డయాబెటిస్ సమస్య అలుముకుంటుంది.