Type 2 Diabetes: టైప్-2 ‘డయాబెటిస్’ కు కారణం ఇదే

వేగంగా విస్తరిస్తున్న టైప్ -2 డయాబెటిస్ కు కారణమేంటో తెలిసింది.

  • Written By:
  • Updated On - May 13, 2022 / 12:14 PM IST

వేగంగా విస్తరిస్తున్న టైప్ -2 డయాబెటిస్ కు కారణమేంటో తెలిసింది. భారత్ లో ప్రతి ఆరుగురిలో ఒకరు టైప్ -2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే…గత దశాబ్దకాలంలో టైప్ -2 డయాబెటిస్ బారినపడుతున్న వారి సంఖ్యలు నాలుగురెట్లు పెరిగింది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది…కారణం ఏంటి…దారితీసే పరిస్థితులేంటి…అనే ప్రశ్నకు సమాధానాలు వెతికేందుకు ప్రారంభించిన అధ్యయనంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ లోని మాంచెస్టర్ వర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో జన్యుపరమైన వైవిధ్యాలే కారణమని వెల్లడైంది. ఈ పరిశోధనలో హైదరబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ చీఫ్ సైటింస్ట్ గిరిరాజ్ ఆర్ చందక్ ఈ అధ్యయనంలో ముఖ్యపాత్ర పోషించారు.

టైప్ -2 డయాబెటిస్ సమస్యకు మానవ జన్యువులు ఎంతవరకు కారణం అవుతున్నాయన్న దానిపై జరిపిన ఈ పరిశోధనలో భాగంగా యూరోపియన్, తూర్పు ఆసియా, దక్షిణాసియా, ఆఫ్రికా, హిస్పానిక్ ప్రజలను టెస్టు చేశారు. మొత్తంగా 11.6లక్షల మందితోపాటు 1.8లక్షల మంది టైప్ -2 మధుమేహం బాధితుల DNAలను తులనాత్మకంగా విశ్లేషించారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే…టైప్-2 మధుమేహం బారినపడిన వారిలో జన్యుపరమైన వైవిధ్యాలు అధికంగా ఉన్నట్లు తేలింది. భారత ప్రజల్లో ఉండే జన్యుపరమైన వైవిధ్యాల వల్లే టైప్ 2 డయాబెటిస్ కు కారణమని తెల్చిచెప్పారు. మధుమేహానికి ఔషధాల తయారీకి ఈ అధ్యయనం ఎంతో ఉపకరిస్తుందని CCMBడైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు.