Site icon HashtagU Telugu

Tomatoes for Vit D: టమోటాలతో విటమిన్ డి.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

Tomato

Tomato

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలి మారుతుంది. ప్రస్తుత కాలంలో మనుషులు చక్కగా ఏసీ ల కింద,ఫ్యాన్ ల కింద కూర్చొని సుఖానికి అలవాటు పడడంతో కాస్త ఎండ తగిలినా కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇంట బయట ఎక్కడా కూడా కష్టపడడం లేదు, కాస్త ఎండను కూడా భరించలేకపోవడంతో చాలామంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. అయితే మనం తినే ఆహార పదార్థాలలో డి విటమిన్ అందే పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడంతా ఎండ అన్నదే చూడకుండా అయిపోతున్నారు. ఎండలో కష్టపడే పనిలేదు. దీనితో ఎక్కడ చూసినా డీ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఆహారం ద్వారా విటమిన్ డీ అందే అవకాశాలు చాలా తక్కువ.

కానీ మనం ఎండలో నిలబడినప్పుడు సూర్యరశ్మిని గ్రహించి శరీరంలో విటమిన్ డీ తయారవుతుంది. కానీ ఎండలో నిలబడేందుకు సమయం లేకపోవడంతో పాటు ఇంకా ఎన్నో కారణాలు ఇబ్బందిగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఆహారం ద్వారా సమృద్ధిగా విటమిన్ డీ అందించడంపై ఇంగ్లాండ్ కు చెందిన జాన్ ఇన్నెస్ సెంటర్ వృక్ష శాస్త్రవేత్తలు దృష్టి పెట్టగా ఈ క్రమంలోనే టమాటాల్లో గణనీయంగా విటమిన్ డీ ఉత్పత్తి అయ్యేలా సరికొత్త పరిశోధనను చేపట్టారు. అయితే శరీరంలో డి విటమిన్ లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.

శరీరంలో తగినంత విటమిన్ డీ ఉంటే కాల్షియం, ఫాస్పరస్‌ వంటి కీలక పోషకాలను శరీరం బాగా సంగ్రహించగలుగుతుంది. ఒకవేళ విటమిన్ డీ అందకపోతే ఎముకలు బలహీనపడటంతోపాటు గుండెజబ్బులు, కొన్ని రకాల కాన్సర్ లకు కూడా దారి తీస్తుంది. ఇక టమాటాల్లో జన్యువులను మార్చి