Site icon HashtagU Telugu

Yellow Teeth: గార పళ్ళతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి.. కేవలం రెండు రోజుల్లో గార మొత్తం మాయం!

Yellow Teeth

Yellow Teeth

మామూలుగా కొంతమంది పళ్ళు ఎంత శుభ్రం చేసుకున్నప్పటికీ పళ్ళపై పసుపుపచ్చని గార మాదిరి పేరుకుపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఇది ఎక్కువ అయిపోయి చూడడానికే పళ్ళు చాలా వికారంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే దంతాలపై పసుపు మరకల కారణంగా చాలామంది మనస్ఫూర్తిగా నవ్వాలన్నా నలుగురికి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ మరకలు ఏర్పడడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇవి ఒకసారి ఏర్పడితే పోగొట్టుకోవడం చాలా కష్టం. అయితే ఇందుకు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు. మరి ఎలాంటి చిట్కాలు పాటిస్తే పళ్ళు శుభ్రంగా మారుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతీ రోజూ బ్రష్ చేయకపోవడం వల్ల పసుపు మరకలు వస్తాయి. అలాగే కాఫీ, టీ, సోడా, రెడ్ వైన్ వంటివి దంతాలకు మరకలను కలిగిస్తాయి. ధూమపానం, పొగాకు అలవాట్లు దంతాలను పసుపు లేదా గోధుమ రంగులోకి మార్చుతాయట. వయస్సు పెరిగే కొద్దీ దంతాల ఎనామెల్ తగ్గిపోతుంది. దీని వల్ల దంతాలు పసుపు రంగులోకి మారతాట. అలాగే కొన్ని రకాల మందులు కూడా దంతాల రంగును ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. కాఫీ, టీ, సోడా, రెడ్ వైన్ వంటివి చాలా వరకు తగ్గియడం మంచిది. చక్కెర, ఆమ్లపు పదార్థాలను తీసుకోవద్దు. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి.

అలాగే బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్ లాగా తయారు చేసి దంతాలను బ్రష్ చేయడం వల్ల పళ్లపై ఉండే గార తొలగిపోతుంది. అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ దంతాలపై ఉన్న మరకలను తొలగించడంలో సహాయపడుతుందట. దీనిని తరచుగా ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. పసుపును నీటిలో కలిపి బ్రష్ చేయడం ద్వారా పసుపు మరకలను తొలగించవచ్చట. ఆపిల్, క్యారెట్, సెలెరీ, కూరగాయలు దంతాలను సహజంగా శుభ్రం చేస్తాయట. కాబట్టి వీటిని డైట్ లో భాగంగా చేసుకోవడం మంచిది. గార మరీ ఎక్కువగా దంత వైద్యులను సంప్రదించడం మంచిది. ఎందుకంటే వైద్యులు పళ్లపై ఉన్న గారను సమర్థవంతంగా తొలగిస్తారు. ఇది మీ దంతాలను ఆరోగ్యంగా, తెల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతులను పాటించడం ద్వారా దంతాలపై పసుపు మరకలను వదిలించుకోవచ్చట.