Site icon HashtagU Telugu

Boiled Potato Water: బంగాళదుంపలను ఉడికించిన నీటితో కీళ్ళ నొప్పులకు బై బై!

Potato

Potato

మన వంటింట్లో ఎక్కువగా దొరికే కూరగాయల్లో బంగాళదుంప కూడా ఒకటి. ఈ బంగాళదుంపలు దుంప జాతికి చెందినవి. బంగాళదుంపని ఆలుగడ్డ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిని చాలామంది ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. మరి ముఖ్యంగా పిల్లలు కూడా వీటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు,పిండి పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. కేవలం నువ్వు మాత్రమే కాకుండా బంగాళదుంపని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బంగాళదుంప లో బరువు పెరగడానికి అవసరమయ్యే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సన్నగా ఉన్నారు బంగాళాదుంపలను తీసుకుంటే బరువు పెరుగుతారు. అలాగే బంగాళా దుంప తేలికగా జీర్ణమవుతుంది. కాబట్టి బంగాళదుంపను పిల్లలకి, పేషెంట్లు కి పెట్టడం వల్ల సులువుగా జీర్ణం అవుతుంది. కడుపు లోని మంటను తగ్గించడానికి బంగాళ దుంప చాలా బాగా పని చేస్తుంది. అలాగే బంగాళదుంప నోటి క్యాన్సర్ కు చికిత్స గా కూడా ఉపయోపడుతుంది. పచ్చి బంగాళదుంప ముద్దని కాలిన గాయాలకు రాస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.

అలాగే గుండె జబ్బులు తగ్గించడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది. బంగాళాదుంపలను ఉడికించిన నీళ్ళు కీళ్ళ నొప్పులకు బాగా పని చేస్తాయి. బంగాళదుంప రక్తపోటును తగ్గిస్తుంది. అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. అలాగే చర్మకాంతికి తోడ్పడుతుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుంది. బంగాళాదుంప ఒత్తిడిని తగ్గించడమే కాకుండా రక్తంలో గ్లూకోస్ స్థాయిలను సక్రమంగా ఉంచుతుంది. గుండె సమస్యలు దూరం చేస్తుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. బంగాళదుంపలో ఉండే విటమిన్స్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్ , జింక్ చర్మానికి ఎంత గానో మేలు చేస్తాయి.