Site icon HashtagU Telugu

Sapota Health Benefits: వామ్మో.. సపోటా తినడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

Sapota Health Benefits

Sapota Health Benefits

సపోటా పండ్ల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇవి ఎంతో తియ్యగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీజనల్‌ ఫ్రూట్స్‌ మన డైట్‌లో కచ్చితంగా చేర్చుకోవడం మంచిది. కొంతమంది డైరెక్టుగా తింటే మరి కొంతమందిని జూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. కాగా సపోటాలో ఐరన్‌, పోటాషియం, కాపర్‌, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌, విటమిన ఏ, బి, సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో ఆస్ట్రింజెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసైడ్‌ లక్షణాలతో కూడిన పాలీఫెనాల్ టానిన్ సమృద్ధిగా ఉంటుంది. సపోటాలో కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇవి మీ ఎముకలను దృఢంగా ఉంచుతాయి, ఆస్టియోపోరోసిస్‌ ముప్పును తగ్గిస్తాయి. సపోటాలో విటమిన్‌ సి, కాపర్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఈ పోషకాలు శరీరంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావానికి వ్యతిరేకంగా పోరాడతాయి. జలుబు, ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే సపోటా తింటే నాసికా మార్గం, శ్వాసకోశం క్లియర్‌ అవుతుంది.​ సపోటా హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌ ఉంటుతుంది. ఈ పండులో సమృద్ధిగా ఉండే పొటాషియం, మెగ్నీషియం సోడియం స్థాయిలు తగ్గిస్తాయి. రక్త ప్రసరణను ప్రోత్సహించి, మీ బ్లడ్‌ ప్రెజర్‌ స్థాయిలను మెయింటేన్‌ చేస్తాయి. ఇది స్ట్రోక్‌, గుండెపోటు వంటి గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గిస్తాయి.

పొటాషియం మూత్రం ద్వారా శరీరం సోడియంను తొలగిస్తుంది. ఇది హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంచడానికి తోడ్పడుతుంది. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. ఇవి చాలా రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి. సపోటాలోని విటమిన్‌ ఏ, బి శరీరంలోని శ్లేష్మ పొరలను నిర్వహించడానికి సహాయపడతాయి. ఇది నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. సపోటాలో డైటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. అధిక మొత్తంలో కేలరీలు ఉండే ఈ పండు తక్షణ శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చూస్తుంది. ఈ పండులో విటమిన్‌ ఎ మెండుగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే కంటి ఆరోగ్యానికి మంచిది. సపోటా ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మెరిసే చర్మానికి కూడా సహాయపడుతుంది. సపోటాలోని విటమిన్‌ ఇ మీ చర్మానికి తేమనందిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షించి యాంటీ ఏజింగ్ కాంపౌండ్‌గా పనిచేస్తుంది.