Site icon HashtagU Telugu

Sapota: సపోటా పండ్లు తింటున్నారా.. ఇదే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Sapota

Sapota

సపోటా పండ్ల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. ఇవి చాలా తీపి గా ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటి వాసనే మనుషులను ఆకర్షిస్తూ ఉంటుంది. సపోటాలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. ఇందులో విటమిన్ ఏ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఇది చర్మం, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. సపోటా పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ఖనిజాలు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే ఇందులో ఫైబర్, ఫాస్పరస్, కాల్షియం కూడా లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు. సపోటాలో కాల్షియం, మాగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అలాగే ఎముకలకు సంబంధించిన కీళ్ల నొప్పులు కీళ్ల వాపులు వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. సపోటాలోని పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా గుండెపోటు ఇతర సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు.

సపోటాలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. సపోటాలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ముడతలు, మచ్చలు తగ్గి చర్మం మృదువుగా మెరిసేలా తయారవుతుంది. అంతేకాకుండా సపోటాలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని చెబుతున్నారు.

note: ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.