Site icon HashtagU Telugu

Salt Water: ఉప్పు నీటిని పుక్కలించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

Mixcollage 01 Feb 2024 08 51 Pm 5967

Mixcollage 01 Feb 2024 08 51 Pm 5967

మామూలుగా చాలామంది అప్పుడప్పుడు ఉప్పు నీటిని గొంతులో పోసుకొని పుక్కిలిస్తూ ఉంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. కాగా మ‌న‌కు గొంతు స‌మస్య‌లు ఉన్నా , శ్వాస‌కొష స‌మ‌స్య‌లు ఉన్నా ఈ ఉప్పు నీరు దివ్యఔష‌దంగా ప‌నిచేస్తుంది. అయితే ఈ చిట్కాని మన పూర్వం రోజుల్లో పెద్దలనుంచి పాటించేవారు. ఉప్పునీరు వల్ల మ‌న‌కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. అయితే ఈ ఉప్పు నీరు గొంతు ఇన్పెక్ష‌న్స్ ను, శ్వాస‌కోస సంబందిత వ్యాధులను త‌గ్గిస్తుంది. గొంతు స‌మస్య వ‌చిన‌ప్పుడు మాత్ర‌మే ఇలా చేయ‌డం కాదు ప్ర‌తి రోజూ బ్రెష్‌ చెసుకున్న త‌రువాత ఈ ఉప్పు నీటిని నోటిలో పోసుకొని పుక్కిలించ‌డం మంచిది.

ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు దరి చేరవు. ప్రతిరోజు మనము ఉప్పు నీటిని గొంతులో పోసుకొని పుక్కిలించడం వల్ల గొంతులో ఉండే బ్యాక్టీరియాలో వైరస్ లు చనిపోతాయి. అలాగే గొంతులో యాసిడ్లు తటస్థం అవుతుంది. ఫలితంగా పీహెచ్ స్థాయిలు సమతుల్యం అవుతాయి. ఈ విధంగా చేయడం వల్ల నోట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోవడంతో పాటు నోటి దుర్వాసన సమస్య కూడా రాదు. అలాగే ఉప్పునీటిని నోట్లో వేసుకొని పుక్కిలించడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా రావు. ముక్కు దిబ్బ‌డ కూడా త‌గ్గుతుంది. నోటి దుర్వాసన ఉన్న‌వారు ప్ర‌తి రోజూ ఇలా చేయాలి. అంతే కాదు నోటిలో పొక్కులు పుండ్లు ఉన్న వారు ఇలా చెస్తే , అవ‌న్ని పోయి నోరు చాలా శుభ్రం అవుతుంది.

శ్వాస‌కోష ఇన్ పెక్ష‌న్స్ ఉన్న‌వారు రోజుకు 3 సార్లు ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న ఈ స‌మ‌స్య‌నుంచి బ‌య‌టప‌డ‌వచ్చు. అలాగే పంటి చిగుళ్లు వాపుతో బాద‌ప‌డేవారు ,పంటి చిగుళ్ల నుంచి ర‌క్త స్రావం అయ్యేవారు ఉప్పు నీటిని గొంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న ఇటువంటి స‌మస్య‌ నుంచి ఉప‌శ‌మ‌నం పోంద‌వ‌చ్చు. ఇప్పుడు నీటిని పుక్కిలించడం వల్ల దంతాల నొప్పి కూడా ఉండదు. కాగా మామూలుగా గొంతులోకి బాక్టిరియాలు, వైర‌స్లు చేర‌డం వ‌ల‌న గొంతులో ఉన్న టాన్సిల్స్ వాపుకు గురి అవుతాయి. ఆహ‌రం తినాలి అన్నా, ఎటువంటి ద్ర‌వాల‌ను తాగాల‌న్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఉప్పు నీటిని గొంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న గొంతు నొప్పి ,వాపు వాటి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది.