Salt : ఉప్పు ఎక్కువగా తింటే బీపీనే కాదు ఇవి కూడా వస్తాయి..!

Salt ఆరోగ్య మీద అవగాహన పెంచుకున్న కొందరు తమకు చేటు చేసే కొన్ని ఆహార పదార్ధాలని దూరం పెట్టేస్తున్నారు. ముఖ్యంగా

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 11:43 PM IST

Salt ఆరోగ్య మీద అవగాహన పెంచుకున్న కొందరు తమకు చేటు చేసే కొన్ని ఆహార పదార్ధాలని దూరం పెట్టేస్తున్నారు. ముఖ్యంగా బీపీని పెంచే ఉప్పుని చాలా వరకు తగ్గించేస్తున్నారు. అయితే బీపీ లో ఉన్న వారు అదే పనిగా ఉప్పు తినేస్తుంటారు. అసలు బీపీ కంట్రోల్ లో ఉన్నా ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల అదనంగా మరికొన్ని సమస్యలు వస్తాయి. ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల ఒక్క బీపీ ఒక్కటే కాదు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తినే ఆహారం లో Salt ఎక్కువగా ఉంటే బీపీ పెరుగుతుందని అందరికీ తెలిసిందే. ఉప్పులో సోడియం ఉంటుంది అది ఎక్కువైతే దాన్ని నియంత్రించేందుకు నీటి సాతం పెరుగుతుంది దాని వల్ల రక్తనాళ్లాల్లో ఒత్తిడి పెరిగి హైపర్ టెన్షన్ బీపీ వస్తాయి. ఆ టైం లో ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పదార్ధాలు తినడం ఆపేయాలి.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ అయ్యి గుండెపోటు, గుండె వైఫల్యానికి దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువ వాడం వల్ల మూత్రపిండాలు కూడా దెబ్బ తినే అవకాశం ఉందని అంటున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం తో శరీరంలో నీరు నిలుస్తుంది. దాని వల్ల చేతులు, పాదాల వల్ల ఉబ్బరం వాపు వస్తాయి. ఉప్పు ఎక్కువగా తింటే యూరిన్ ద్వారా కాల్షియం విసర్జ అవుతుంది. దాని వల్ల ఎముకల సాంద్రత తగ్గే అవకాశం ఉంది.

ఉప్పు వల్ల కడుపు క్యాన్సర్ కూడా వచ్చే ముప్పు ఉందట. జ్ఞాపక శతి మీద ఉప్పు ప్రభావం ఉంటుందట. శరీతంలో డీ హైడ్రేషన్, ఓవర్ హైడ్రేషన్ లకు దారి తీస్తుంది. సో ఉప్పు వల్ల బీపీనే కాదు ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Also Read : The Vijay Devarakonda : ది దేవరకొండకు షాక్ ఇచ్చిన హీరోయిన్..!