Sadhguru Jaggi Vasudev: ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ స‌ర్జ‌రీకి కార‌ణ‌మిదే..?

ఇషా ఫౌండేషన్ కోయంబత్తూర్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) ఇటీవల అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేయించుకున్నారు.

  • Written By:
  • Updated On - March 21, 2024 / 03:25 PM IST

Sadhguru Jaggi Vasudev: ఇషా ఫౌండేషన్ కోయంబత్తూర్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) ఇటీవల అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేయించుకున్నారు. మెదడులోని ఒక భాగంలో వాపు, అంతర్గత రక్తస్రావం కారణంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ సర్జరీ మార్చి 17న జరిగింది. దీని గురించి సద్గురు వీడియో సందేశం ద్వారా అందించారు.

బ్రెయిన్ సర్జరీ తర్వాత అతని పరిస్థితి బాగానే ఉందని, త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని సద్గురు వీడియోలో చెప్పారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ గత నాలుగు వారాలుగా తలనొప్పితో బాధపడుతున్నారు. కానీ అతను దానిని పట్టించుకోలేదు. దాని కారణంగా పరిస్థితి మరింత తీవ్రమైంది.

మెదడులో రక్తస్రావం, వాపు సమస్య

సద్గురుకి శస్త్రచికిత్స చేసిన న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ప్రకారం., నాలుగు వారాల క్రితం అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడంతో వ్యాధి మొదలైంది. కానీ అతను ఈ బాధను పట్టించుకోకుండా తన సాధారణ పనిని కొనసాగించాడు. ఇషా ఫౌండేషన్ ప్రకారం.. అతను తన ఎడమ కాలు బలహీనంగా, 4 వారాల పాటు నిరంతరం వాంతులుతో బాధపడుతున్నాడు. మార్చి 15న అతను తీవ్రమైన తలనొప్పిని అనుభవించిన తర్వాత అతని పరిస్థితి మరింత దిగజారింది. దీని తర్వాత MRI, CT స్కాన్‌లో సద్గురు మెదడులో రక్తస్రావం, వాపు కనిపించింది.

Also Read: Pawan Meets Chandrababu: సీట్ల పంపకాలపై చంద్రబాబుతో పవన్ కీలక భేటీ

ఈ సమస్య ఏమిటి..?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మెదడులోని రక్తనాళాలు బలహీనంగా, ఒత్తిడిలో ఉన్నప్పుడు, అది హెమరేజిక్ స్ట్రోక్‌కు దారి తీస్తుంది. అంటే ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్. ఇటువంటి పరిస్థితిలో మెదడులో రక్తస్రావం జరగవచ్చు. ఇది తలలో తీవ్రమైన నొప్పితో మొదలవుతుంది.

We’re now on WhatsApp : Click to Join

ఈ లక్షణాలను విస్మరించకూడదు

ముఖ్యంగా మీరు బీపీ సమస్యతో బాధపడుతుంటే పొరపాటున కూడా ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

– తీవ్రమైన తలనొప్పి
– బలహీనత
– వికారం, వాంతులు
– తిమ్మిరులు.
– దృష్టి సమస్యలు
– ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం త‌గ్గ‌టం