Sabja Seeds: సబ్జా గింజలే కదా అని లైట్ తీసుకుంటున్నారా.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో?

​సబ్జా గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనా

  • Written By:
  • Publish Date - March 25, 2024 / 10:41 PM IST

​సబ్జా గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. సబ్జా గింజల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో విటమిన్‌ ఎ, ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి తరచూ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీవక్రియలను మెరుగుపరుస్తాయి. బరువును కంట్రోల్‌ లో ఉంచుతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వీటిలోని ఫైబర్‌ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

కేవలం ఇవి మాత్రమే కాకుండా సబ్జా గింజల వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అయితే కొన్ని ప్రతికూల గుణాలను కూడా ఇవి కలిగివుంటాయి. షుగరు వ్యాధి ఉన్నవారు పొరపాటున కూడా సబ్జా గింజలు తినకూడదు. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడానికి మందులు వాడుతుంటారు. సబ్జా గింజలు ఈ మందులకు ప్రతిస్పందించే గుణాలను కలిగివుండటంవల్ల శరీరానికి హాని జరుగుతుంది. సబ్జాగింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

ఇవి రక్తాన్ని పలుచగా చేయడంవల్ల రక్తం గడ్డకట్టే ప్రక్రియ నెమ్మదిస్తుంది. సబ్జా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజుకు 4 నుంచి 5 సార్లు తీసుకుంటే అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. వీటిల్లో పీచుఎక్కువగా ఉండి త్వరగా జీర్ణం కావు. ఇటువంటి పరిస్థితుల్లో జీర్ణవ్యవస్థ గందరగోళంగా మారుతుంది. శరీరాన్ని వేడి నుంచి రక్షించడంలో వీటిది కీలకపాత్ర. అంతేకాదు.. మెరుగైన ఆరోగ్యాన్నిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులు, మలబద్ధకం లాంటివాటికి సబ్జా గింజలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. కొబ్బరి నూనెలో సబ్జా గింజల పిండిని కలిపి రాయడంవల్ల సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులను నయం చేస్తుంది. సబ్జా గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల కొత్త చర్మ కణాలకు అవసరమైన కొల్లాజెన్ స్రవిస్తుంది. సబ్జా గింజల్లో ఉండే యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు కండరాల సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కండరాలకు విశ్రాంతినిస్తాయి.