Site icon HashtagU Telugu

Sabja Seeds: సబ్జా నీరు తాగితే జుట్టు పెరుగుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

What Are Sabja Seeds And How Beneficial Are They For You 02

What Are Sabja Seeds And How Beneficial Are They For You 02

సబ్జా గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో సబ్జా గింజలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది రాత్రి సమయంలో సబ్జా గింజలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని తాగుతూ ఉంటారు. సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే సబ్జా గింజలు తీసుకుంటే జుట్టు పెరుగుతుందా? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రోజుల్లో చాలా మంది జుట్టురాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అలాంటి వారు రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ సబ్జా నీటిని తాగడం అలవాటు చేసుకుంటే కచ్చితంగా వారి జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవట్టనే పెట్టవచ్చని చెబుతున్నారు. అయితే ఈ నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. ఒక గ్లాసు వాటర్ లో ముందుగా ఒక స్పూన్ సబ్జా గింజలను వేయాలి. వాటిని కనీసం 30 నిమిషాల పాటు నాననిచ్చి ఆ తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ తేనె, అరచెక్క నిమ్మరసం పిండుకొని తాగితే సరిపోతుందట. ఇలా తరచుగా తాగితే ఒంట్లో వేడి తగ్గడం మాత్రమే కాకుండా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు.

అలాగే పోషకాలు అధికంగా ఉండే ఈ సబ్జా గింజలు కొంచెం గట్టిగానే ఉంటాయి. అందుకే నీటిలో నానబెట్టిన తర్వాత తీసుకోవాలని చెబుతున్నారు. ఈ గింజల్లో ఫైబర్ ,ప్రొటీన్లు అధికంగా ఉంటాయి..అవి సంతృప్తిని ప్రోత్సహిస్తాయి. అలాగే బరువు తగ్గడంలో సహాయపడతాయట. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయట. జీర్ణ ఆరోగ్యాన్ని మంచి ఆకృతిలో ఉంచుతాయని చెబుతున్నారు. సబ్జా గింజలు ఆకలిని అణచివేస్తాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకున్న వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అలాగే సబ్జా గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది జీవక్రియను నెమ్మదీస్తుంది. రక్తంలో కూడా చక్కెర స్థాయిలు కూడా పెరగకుండా చేస్తుంది. అలాగే సబ్జా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. గుండెల్లో మంట లాంటి సమస్య ఉన్నవారికి ఇది మంచి పరిష్కారంగా నిలుస్తుంది.