Site icon HashtagU Telugu

Sabja Seeds Water: సబ్జా నీరు తాగితే జుట్టు పెరుగుతుందా.. ఇందులో నిజమెంత?

Sabja Seeds Water

Sabja Seeds Water

సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ నీటిని కూడా తాగుతూ ఉంటారు. సమ్మర్ లో నన్నారి వంటివి చేసినప్పుడు పైన ఈ నానబెట్టిన సబ్జా గింజలను వేసి ఇస్తూ ఉంటారు. నానబెట్టిన సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుందని బరువు కూడా తగ్గుతారని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే సబ్జా గింజలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంతోపాటు కొన్ని రకాల సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయట.. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున సబ్జా గింజల నీరు తాగడం వల్ల జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చట. ఇలా తాగే నీటిలో కొద్దిగా తేనె నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది అని చెబుతున్నారు. అలాగే ఒక గ్లాసు నీటిలో ముందుగా ఒక స్పూన్ సబ్జా గింజలను వేయాలి. వాటిని కనీసం 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఆ నీటిలో ఒక స్పూన్ తేనె, అరచెక్క నిమ్మరసం పిండుకొని తాగితే సరిపోతుందట. ఇలా రెగ్యులర్ గా తాగితే ఒంట్లో వేడి తగ్గడం మాత్రమే కాకుండా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు.

కాగా పోషకాలు అధికంగా ఉండే ఈ సబ్జా గింజలు కొంచెం గట్టిగా ఉంటాయట. అందుకే నీటిలో నానబెట్టిన తర్వాత వీటిని తింటారు. ఈ గింజల్లో ఫైబర్ ,ప్రొటీన్లు అధికంగా ఉంటాయట. అవి సంతృప్తిని ప్రోత్సహిస్తాయట. అలాగే బరువు తగ్గడంలో సహాయపడతాయని, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు. సబ్జా గింజలు ఆకలిని అణిచివేస్తాయట. అలాగే తృప్తి అనుభూతిని ప్రోత్సహిస్తాయట. బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇది మంచి ఎంపిక అని చెబుతున్నారు. కాగా సబ్జా గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయట. ఎందుకంటే ఇది జీవక్రియను నెమ్మదిస్తుందట. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నెమ్మదిగా జీర్ణం చేస్తుందని చెబుతున్నారు. సబ్జా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుందట. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందట. గుండెల్లో మంట లాంటి సమస్య ఉన్నవారికీ ఇది మంచి పరిష్కారంగా నిలుస్తుందని చెబుతున్నారు.

Exit mobile version