Sabja Seeds: అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే సబ్జా గింజలను ఇలా తీసుకోవాల్సిందే?

సబ్జా గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 15 Feb 2024 09 05 Pm 3995

Mixcollage 15 Feb 2024 09 05 Pm 3995

సబ్జా గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను బయటికి పంపిస్తాయి. ముఖ్యంగా బరువును తగ్గించుకోవడంలో ఇవి ఎంతో బాగా పనిచేస్తాయి. వీటిని ఉపయోగించి ఈజీగా బరువు తగ్గవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అధికమొత్తంలో ఫైబర్ కలిగి ఉండటం వల్ల బరువును తగ్గించడం చాలా సులభతరం అవుతుంది.

సరిచేసి జీర్ణశక్తిని పెంచుతాయి. ఈ సబ్జాల్లో కాపర్, క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి ఇన్సులిని నివారించే తగ్గించడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇవి బరువు తగ్గించుకునేందుకు ఉపయోగకారిగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలతో జ్యూస్ ని ఎలా తయారు చేసి ఉపయోగించాలో తెలుసుకుందాం.. అయితే దీనికోసం ముందుగా ఒక బౌల్ లోకి కొన్ని సబ్జా గింజలు తీసుకోవాలి. అందులో కొద్దిగా నీరు పోసి ఒక అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత నిండా నీళ్లు పోసిన గ్లాస్ ని తీసుకుని అక్కడ ఉంచాలి. గిన్నెలో నానబెట్టిన సబ్జాల్లో నుంచి సబ్జా గింజల్ని తీసుకుని ఆ గ్లాసులో వేయాలి. తర్వాత బాగా కలియ తిప్పాలి.

ఆ తర్వాత ఆ గ్లాసులో ఉన్న సబ్జా వాటర్ ను తాగాలి. అలా తాగితే అందులో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాక్టరీ ఆసిడ్స్ బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇలా ప్రతిరోజు ఒక గ్లాసుడు సబ్జా వాటర్ తాగితే అతి త్వరలోనే బరువు తగ్గి మంచి నాజూకుగా తయారవుతారు. ఈ సబ్జాల్ని ఇతర జ్యూసుల్లో సలాడ్స్ లో సూప్స్ లో కూడా కలిపి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా బరువు తగ్గి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ముఖ్యంగా సబ్జా గింజలని వేసవికాలంలో తీసుకోవడం వల్ల ఇంకా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

  Last Updated: 15 Feb 2024, 09:10 PM IST