Site icon HashtagU Telugu

Sabja Seeds: ఏంటి.. సబ్జా గింజలు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి మేలు చేస్తాయని మీకు తెలుసా?

Sabja Seeds

Sabja Seeds

సబ్జా గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిని సమ్మర్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సబ్జా గింజలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగపడతాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు నిపుణులు. మరి సబ్జా గింజలతో అందాన్ని ఎలా పెంచుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామూలుగా వాహనాల నుంచి వెలుపడే పొగ, అదేవిధంగా కాలుష్యం దుమ్ము ధూళి వంటి కారణాలు కారణంగా చర్మం కాంతిని కోల్పోతూ ఉంటుంది. వీడివీటి కారణంగా మొటిమలు మచ్చలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ గింజలలో ఉండే సహజ డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయట. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు. అలాగే చర్మ సంబంధించిన ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలి అంటే క్రమం తప్పకుండా సబ్జా గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.

ఇందులోని యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయట. కాగా సబ్జా గింజల్లో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఈ గింజల్లో విటమిన్ ఏ సి పొటాషియం, కాపర్,మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయట. వయసు మీద పడగానే చర్మం ముడతలు రావడం అన్నది సహజం. చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటి వారు సబ్జా గింజలతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ను ట్రై చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. చెంచా కొబ్బరి నూనెలో సరిపడినంత సబ్జా గింజల పొడి కలుపుకొని ముఖానికి అప్లై చేసుకొని గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది అని చెబుతున్నారు.