సబ్జా గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిగతా సీజన్లో తో పోల్చుకుంటే ఎండాకాలంలో వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. జ్యూస్ల రూపంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. ఈ సబ్జా గింజలను మీరు పాలు, ఖర్జూరం, యాలకులతో కూడా కలిపి తీసుకోవచ్చు. వీటితో ఎన్నో రకాల జ్యూస్ లు, ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చట.. అయితే సబ్జా గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో, సబ్జా మిల్క్ షేక్ ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేసవిలో శరీరాన్ని చల్ల దనాన్ని అందించడంలో సబ్జా గింజలు ఎంతో ఉపయోగపడుతాయట. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందట. సబ్జా గింజలు తీసుకోవడం వల్ల వేసవి ఎండల్లో కోలిపోయిన శక్తిని మళ్లీ తిరిగి తీసుకువస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయట. అలాగే సబ్జా గింజలు మలబద్దకం, ఆహారం సులువుగా జీర్ణం అవ్వడానికి ఎంతో మేలు చేస్తాయట. దీనిని మనం ప్రతిరోజు నీటితో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయట.
డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయట. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని చెబుతున్నారు. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుందట. అధిక రక్తపోటు ఉన్నవారు దీనిని మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిదట. కాగా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఉదయం ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయట.
ఇకపోతే సబ్జా గింజలు మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు,1 కప్పు పాలు, 2 ఖర్జూరాలు, 1 యాలకుల పొడి తీసుకోవాలి. సబ్జా గింజలను 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. ఒక గ్లాస్‌లో పాలు, ఖర్జూరాలు, యాలకుల పొడి వేసి బ్లెండ్ చేయాలి. నానబెట్టిన సబ్జా గింజలను నీటి నుండి తీసి, బ్లెండ్ చేసిన పాలలో కలపాలి. మంచిగా బ్లెండ్ చేసి, వడకట్టి, చల్లగా తాగాలి. అయితే ఇందులో మీరు రుచి కోసం తేనె లేదా కొంచెం పంచదార కూడా కలుపుకోవచ్చు. అదనంగా బెర్రీలు పండ్ల ముక్కలు కూడా చేర్చుకోవచ్చు.