Rose Apple Juice: కాలం ఏదైనా.. కొంతమందికి శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో వేసే చలికి గజగజ వణికిపోతూ కొందరుంటే.. అసలు శీతాకాలమే కాదన్నట్టుగా ఉంటారు మరికొందరు. అందుకు కారణం వారి శరీరంలో వేడి అధికంగా ఉండటమే. శీతాకాలంలోనూ కూల్ డ్రింక్స్, ఇతర శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. ఫలితంగా శరీర బరువు కూడా పెరుగుతుంది. అంతేకాదు.. ఆస్ట్రియో పోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.
శరీరంలో వేడి తగ్గేందుకు ఇంట్లోనే ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల వేడి తగ్గడంతో పాటు.. ఇన్ స్టంట్ ఎనర్జీని పొందవచ్చు. ఈ జ్యూస్ పేరు రోజ్ యాపిల్ జ్యూస్.. దానిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
రోజ్ యాపిల్ జ్యూస్ తయారీకి కావలసిన పదార్థాలు
కలబంద గుజ్జు – ఒక పెద్ద ముక్క
తేనె, నిమ్మరసం – రుచికి తగినంత
అల్లం ముక్కలు – 1 ఇంచు
రోజ్ యాపిల్స్- 6
రోజ్ యాపిల్ జ్యూస్ తయారీ విధానం
ఒక జార్ లో కలబంద గుజ్జును ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 6 రోజ్ యాపిల్స్ ముక్కలు, అల్లం ముక్క వేసి.. కొద్దిగా నీరు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ జ్యూస్ ను ఒక గిన్నెలోకి తీసుకుని.. అందులో తగినన్ని చల్లటినీళ్లు పోసుకుని కలుపుకోవాలి. రుచికి సరిపడా తేనె, నిమ్మరసం వేసి కలపాలి. ఈ రోజ్ యాపిల్ జ్యూస్ ను రోజూ ఒకగ్లాసు తాగితే.. శరీరంలో వేడి తగ్గుతుంది. ఏ వయసువారైనా దీనిని తాగొచ్చు.