Diabetes: షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు…!!!

మధుమేహం అనేది...మన జీవనశైలి...ఆహారం...ఇతర అలవాట్ల రూపంలో ఆహ్వానించినట్లే. టైప్ 1 జన్యు వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధి. టైప్ 2 మధుమేహం బారినపడటం లేదా దానికి దూరంగా ఉండేందుకు స్వీయ నియంత్రణలోనే ఉందని వైద్యులు చెప్పేమాట.

  • Written By:
  • Publish Date - August 8, 2022 / 04:00 PM IST

మధుమేహం అనేది…మన జీవనశైలి…ఆహారం…ఇతర అలవాట్ల రూపంలో ఆహ్వానించినట్లే. టైప్ 1 జన్యు వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధి. టైప్ 2 మధుమేహం బారినపడటం లేదా దానికి దూరంగా ఉండేందుకు స్వీయ నియంత్రణలోనే ఉందని వైద్యులు చెప్పేమాట. షుగర్ ఆరోగ్య సమస్య అయినప్పటికీ…ఎన్నో వ్యాధులకు ,జీవనకాలం తగ్గేందుకు దారితీసే మహమ్మారి. గుండె, మూత్రపిండాలు,కళ్ల ఆరోగ్యాన్ని మధుమేహం చాలా దెబ్బతీస్తుంది. షుగర్ జీవనకాలాన్ని సుమారు 10ఏళ్లు తగ్గిస్తుందని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు తేల్చి చెప్పాయి. టైప్ 2 డయాబెటిస్ కు నిపుణులు చెప్పే ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం.

పొగతాగడం:
పొగతాగడానికి, మధుమేహానికి మధ్య సంబంధం ఏంటనే ప్రశ్న మీలో కలగవచ్చు. కానీ పొగతాగే అలవాటు ఉన్న వారికి మధుమేహం వచ్చే రిస్క్ 40 శాతం ఉంటుందని అమెరికాకు చెందిన సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది. మధుమేహానికి సంబంధించి మార్పు చేసుకోతగిన రిస్క్ ఫ్యాక్టర్ గా పొగతాగడాన్ని పేర్కొంటున్నారు హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ ఫ్రాంక్ బీ హు.

అధిక పిండి పదార్థాలు:
టైప్ 2 మధుమేహంతో బాధపడేవారు కానీ…దీని బారిన ఇంకా పడనివారు కావచ్చు…కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో షుగర్ పరిమాణాన్ని నియంత్రణలో పెట్టుకోవాలంటే మొత్తంగా ఒకరోజులు తీసుకునే పిండిపదార్థాల పరిమాణంపై అవగాహన ఉండాలి. కూరగాయలు, స్వీట్ పొటాటో, మొక్కజొన్న, బఠానీల్లో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.

కదలికల్లేని జీవనశైలి:
కదలకుండా కూర్చుని ఎక్కువ సమయం పనిచేసే వారికి టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఇఫ్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఒకవేళ రోజులో కొద్దిసేపు వ్యాయామం చేసి…మిగిలిన రోజులో సుదీర్ఘ సమయం తింటూ, కూర్చునే వారికి కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ వారు చేసే వ్యాయామాలతో ఆ రిస్క్ ను తగ్గించుకునేందుకు సాధ్యపడుతుంది. ఎక్కువ సేపు కూర్చునే ఉద్యోగుల్లో ఉన్న వారు అరగంట లేదా గంట వ్యవధిలో ఒకనిమిషం పాటు కదలడం చేయాలి.

స్థూలకాయం:
అధిక బరువు అనేది ఎన్నో అనర్థాలు తెస్తుందని ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా అధికబరువు ఉన్నవారికి టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు కూడా వారికి ఎక్కువే అని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతోంది. అధిక రక్తపోటుకు కూడా దారితీస్తుంది. కాబట్టి బరువు ఎక్కువగా ఉన్నవారు వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.