DEXA Scan Vs Heart Attack : మనకు ఎన్నో స్కాన్ ల గురించి తెలుసు..
ఇప్పుడు లేటెస్ట్ గా ఒక స్కాన్ పై ప్రధాన డిస్కషన్ నడుస్తోంది..
అదే.. డెక్సా స్కాన్..!
ఈ స్కాన్ చేయిస్తే గుండెపోటు వచ్చే ముప్పును ముందే తెలుసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది..
అయితే ఇందులో నిజమెంత ?
డెక్సా స్కాన్ ఎందుకు ?
మన ఎముకలు గట్టిగా ఉన్నాయా.. లేదా.. అనేది తెలుసుకోవడానికి డెక్సా స్కాన్ చేస్తారు. ఇది చేస్తే ఎముకల సాంద్రత(డెన్సిటీ) ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది. ఎముకలు పెలుసుగా మారాయా.. గట్టిగానే ఉన్నాయా అనేది తేలిపోతుంది. తాజాగా అమెరికాలోని మసాచుసెట్స్ లో ఉన్న హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో డెక్సా స్కాన్ తో ముడిపడిన కొత్త విషయం ఒకటి తెలిసింది. అదేమిటంటే.. గుండెపోటు భవిష్యత్తులో వస్తుందో లేదో అనేది కూడా డెక్సా స్కాన్ అంచనా వేస్తుందని ఈ రీసెర్చ్ లో గుర్తించారు. గుండె నుంచి పొట్టలోకి వచ్చే ధమనిలో కాల్షియం ఉంటుంది. గట్టిపడిన ఈ కాల్షియం కూడా డెక్సా స్కాన్‌లో(DEXA Scan Vs Heart Attack) కనిపిస్తుంది. ఒకవేళ అలా కనిపిస్తే రక్తనాళాలు గట్టిపడుతున్నాయని భావించవచ్చు. అంటే రక్త నాళాల్లో భవిష్యత్తులో పూడికలు వచ్చే ఛాన్స్ ఉంటుందని, అది గుండెపోటుకు దారితీస్తుందని అలర్ట్ అయిపోవాలి. గుండె నుంచి పొట్టలోకి వచ్చే ధమనిలోని కాల్షియాన్ని లెక్కగడితే.. గుండెపోటు ముప్పు ఉందో లేదో తెలుస్తుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు తెలిపారు.
సోడియం, కొలెస్ట్రాల్ ఫుడ్స్ తగ్గించాలి
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సోడియం, కొలెస్ట్రాల్ ఫుడ్స్‌ని ముందుగా తగ్గించాలి. విటమిన్లు, ఖనిజాల్, గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తినాలి. పోషకాలతో నిండి ఉన్న సూపర్ ఫుడ్స్ మీ ఆరోగ్యాన్ని కాపాడి గుండె సమస్యల నుంచి దూరం చేస్తాయి. అయితే గుండె ఆరోగ్యానికి మంచివి కదా ఎక్కువగా తినొద్దు. వీటిని తీసుకునే ముందు డాక్టర్‌ని సంప్రదించి ఎంత తినాలో తెలుసుకుని తినడం మంచిది.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు
అవిసె గింజలు, సబ్జా గింజలు, వాల్‌నట్‌లలో ఉండే ఒమేగా-3 కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాల్లో తేలింది.
Also read : Chandrayaan3-August 5 : చంద్రయాన్ 3 మిషన్ లో ఈరోజు సాయంత్రం ఏం జరగబోతోంది ?
చియా సీడ్స్
చియా సీడ్స్, అవిసెలు రెండు కూడా సూపర్‌ఫుడ్స్ అని చెప్పొచ్చు. మొక్కల ఆధారిత ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలకి మెయిన్ సోర్స్. ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్. చియా సీడ్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ట్రై గ్లిజరైడ్స్, ఎల్‌డిఎల్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. ఈ గింజల్లోని ఒమేగా 3, థ్రాంబోసిస్, అరిథ్మియా వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిని సలాడ్స్‌లో వేసి తీసుకోవచ్చు. లేదా పొడిలా చేసి అన్నం, ఇడ్లీ, దోశల్లో తినొచ్చు. ఈ పొడులను కూరలు, రసం, సాంబార్‌లో కూడా వాడొచ్చు. ఇలా ఏదో రూపంలో అయినా రోజూ తీసుకోవడం మంచిది.
గమనిక: ఈ వార్తలోని వివరాలను మెడికల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ, అధ్యయన నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.