Site icon HashtagU Telugu

Contact Lenses: కాంటాక్ట్ లెన్సులలో ప్రమాదకర కారకాలు.. సంచలన విషయం బయటపెట్టిన సైంటిస్టులు

Contact Lenses 1200x720

Contact Lenses 1200x720

Contact Lenses: కంటిచూపు మందగించినవారు చాలామంది కాంటాక్ట్ లెన్సులు ఉపయోగిస్తూ ఉంటారు. కళ్లజొడు వల్ల సమస్యలు వస్తాయని, కళ్లు లొపలికి గుంజినట్లు అవుతాయని కాంటాక్ట్ లెన్సులు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కాంటాక్ట్ లెన్సులకు సంబంధించి ఓ రీసెర్చ్ లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కాంటాక్ట్ లెన్సులో ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలు ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు.

యూఎస్ నుంచి వచ్చిన అనేక సాఫ్ట్ కాంటాక్ట్ లెన్సుల్లో క్యాన్సర్ కారకాలను పరిశోధనల్లో గుర్తించారు. క్యాన్సర్‌కు కారణమయ్యే ఫరెవర్ కెమికల్స్ తో కాంటాక్ట్ లెన్సులో తయారుచేసినట్లు ఓ రీసెర్చ్ లో పరిశోధకులు గుర్తించారు. కాంటాక్ట్ లెన్సులపై రీసెర్చ్ చేసేందుకు 18 రకాల పాపులర్ కాంటాక్ట్ లెన్సులను పరిశీలించారు. లెన్సుల్లో ప్రతీదానిలో పాలీఫ్లోరో పాలీఫ్లోరో ఆల్కహాల్ పదార్ధం మార్క్ అయిన ఆర్గానిక్ ఫ్లోరిన్ అధిక స్థాయిలో ఉందని గుర్తించారు.

అలాగే లెన్సుల్లో ఫ్లోరిన్ జాడలను కూడా కనుగొన్నారు. పలు బ్రాండ్ల కాంటాక్ట్ లెన్సులలో 105 పీపీఎమ నుంచి 20 వేల పీపీఎం మధ్య ఫ్లోరిన్ కనుగొన్నారు. పీపీఎస్ వినియోగం ఎక్కువగా ఉంటే రక్తపోటు, కొలెస్ట్రాల్, మూత్రపిండాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. ఇక కాంటాక్ట్ లెన్సుల్లోనే కాకుండా టాయిలెట్ పేపర్లలో కూడా ప్రమాదకరమైన ఫరవర్ కెమికల్స్ ఉంటాయని చెబుతున్నారు.

ఆస్టగ్మాటిజం, ఆల్కాన్ ఎయిర్ ఆప్టిక్స్ కలర్స్ విత్ స్మార్ట్‌షీల్డ్ టెక్నాలజీ, డైలీ వేర్ కోసం ఆల్కాన్ టోల్ 30 కాంట్రాక్ట్ లెన్సులలో అధిక మొత్తంలో ఆర్గానిక్ ఫ్లోరిన్ ఉన్నట్లు తేల్చారు. వేడిని తట్టుకునే ఉత్పత్తులో పీఎఫ్‌ఏని సాధారణంగా ఉపయోగిస్తారు. వబట్టులు, వైర్స్, ప్యాకేజింగ్, ఫర్నీచర్ వంటి వాటిల్లో వాడతారు. ఇవి వచ్చిన్నం కావని, అందుకే ఫరెవర్ అంటారని చెబుతున్నారు. కాంటాక్ట్ లెన్సులలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయనే ఈ వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి,