Site icon HashtagU Telugu

Rice Water Cubes: బియ్యం నీటి ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేయాలి? ప్ర‌యోజ‌నాలు ఏమిటి??

Rice Water Cubes

Rice Water Cubes

Rice Water Cubes: మొటిమలు లేని, గాజులా మెరిసే చర్మాన్ని పొందడానికి బియ్యం నీటిని ఉపయోగించవచ్చు. బియ్యం నీటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సూర్యరశ్మి వల్ల కమిలిపోయిన చర్మాన్ని నయం చేయడంలో చర్మ రంధ్రాలను (పోర్స్) తగ్గించడంలో జిడ్డును నియంత్రించడంలో మొటిమలు, నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది. బియ్యం నీటిని టోనర్‌గా లేదా ముఖం కడుక్కోవడానికి ఉపయోగించవచ్చు. మీరు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ (Rice Water Cubes) రూపంలో నిల్వ చేసి రోజూ వాడుకోవచ్చు. ఈ వ్యాసంలో బియ్యం నీటి ఐస్ క్యూబ్స్‌ను ఎలా తయారు చేయాలో? వాటి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

బియ్యం నీటి ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేయాలి?

బియ్యం నీటి ఐస్ క్యూబ్స్ తయారు చేయడం చాలా సులభం. ఈ పద్ధతిని అనుసరించండి.

నానబెట్టడం: ముందుగా కొద్దిగా బియ్యాన్ని శుభ్రం చేసి, కొంతసేపు నీటిలో నానబెట్టండి.

వడకట్టడం: నానబెట్టిన బియ్యం నీటిని వడకట్టి, ఆ నీటిని ఐస్ క్యూబ్ ట్రేలో పోయండి.

ఫ్రిజ్‌లో పెట్టడం: ఐస్ ట్రేని ఫ్రిజ్‌లో పెట్టి పూర్తిగా గడ్డకట్టనివ్వండి.

సిద్ధం: గడ్డకట్టిన తర్వాత మీ రైస్ వాటర్ ఐస్ క్యూబ్స్ సిద్ధంగా ఉంటాయి. మీరు వాటిని ముఖంపై సులభంగా ఉపయోగించుకోవచ్చు.

Also Read: SS Thaman: రాబోయే నాలుగు నెల‌లు కూడా థ‌మ‌న్‌దే హ‌వా.. చేతిలో భారీ ప్రాజెక్టులు!

ముఖంపై రైస్ వాటర్ క్యూబ్స్ వాడటం వల్ల లాభాలు

వృద్ధాప్య లక్షణాలు తగ్గింపు: బియ్యం నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి యాంటీ-ఏజింగ్ లక్షణాలను అందిస్తాయి.

చర్మ రంధ్రాలు తగ్గింపు: చర్మంపై పెద్దగా కనిపించే రంధ్రాలను తగ్గించడంలో ఈ ఐస్ క్యూబ్స్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

వాపు తగ్గింపు: ముఖం లేదా కళ్ల చుట్టూ కనిపించే వాపు (పఫ్ఫినెస్) సమస్యను కూడా తగ్గిస్తాయి.

హైడ్రేషన్: రైస్ ఐస్ క్యూబ్స్‌ను వాడటం వల్ల చర్మానికి హైడ్రేషన్ లభిస్తుంది. ఇది పొడి చర్మాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది.

గ్లాసీ స్కిన్: వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మానికి గాజులా మెరిసే కాంతి వస్తుంది.

Exit mobile version