Site icon HashtagU Telugu

Poha Vs Rice : అన్నం మంచిదా? పోహా మంచిదా?

Poha Vs Rice

Poha Vs Rice

Poha Vs Rice :  బియ్యం తింటే మంచిదా ?

అటుకులు (పోహా) తింటే మంచిదా ?

చాలామంది అటుకులను సాధారణ బియ్యానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు.

పోషకాహార నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు  చూద్దాం. 

బియ్యం, పోహా(Poha Vs Rice).. ఈ రెండింటిలో ఒకే విధమైన పోషకాలు ఉంటాయని చాలామంది భావిస్తారు. కానీ వీటిలో క్యాలరీలు డిఫరెంట్ లెవల్స్ లో ఉంటాయి. ఫైబర్, ఐరన్ లెవల్స్ లో కూడా తేడాలు ఉంటాయి. చాలామంది పోషకాహార నిపుణులు బియ్యం కంటే పోహా ఆరోగ్యకరమైనదని చెబుతుంటారు. అటుకులలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి రక్తంలోని  షుగర్  లెవల్స్ ను నియంత్రించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. జీర్ణక్రియను బెటర్ చేయడంలో సహాయపడుతుంది. అటుకుల్లో ఐరన్ ఎక్కువ. అందుకే రక్తహీనతతో బాధపడేవారు అటుకులను తింటే మంచిది. అటుకులు తినడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అధికంగా ఉంటుంది. కాబట్టి ఎనీమియా వంటి రోగాల బారిన పడకుండా ఇది కాపాడుతుంది. ఐరన్ సప్లిమెంట్లు వాడుతున్న వారు వాటికి బదులు పోహాతో చేసిన ఆహారాన్ని అధికంగా తింటే మంచిది.

Also read : Egg Yellow Yolk : గుడ్డులోని పచ్చసొనను తినకూడదా..?

పోహాకు నిమ్మరసం జోడించి తింటే బెటర్. పోహా తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. ఇది ఒక ప్రో బయోటిక్ గా కూడా పనిచేస్తుంది. పొట్టలోని మంచి బాక్టీరియాను కాపాడడంలో పోహా హెల్ప్ చేస్తుంది. అటుకులపై ఉండే ఒక పొర చెక్కుచెదరకకుండా ఉంటుంది. కాబట్టి దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొంచెం తిన్నా కూడా పొట్ట నిండిన భావన కలుగుతుంది. వండిన అన్నంతో పోలిస్తే పోహాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఇవి నియంత్రించగలవు. కాబట్టి షుగర్ బారినపడినవారు అటుకుల ఫుడ్ ను తినడం అవసరం. బరువు తగ్గాలనుకుంటున్న వారికి కూడా పోహా బెటర్ ఆప్షన్.

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను మెడికల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ, అధ్యయన నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.