Pregnancy Loss : ఆ జాబ్స్ చేసే మహిళలకు గర్భస్రావాల ముప్పు

ప్రత్యేకించి కొన్ని వృత్తులలో పనిచేసే మహిళలకు గర్భస్రావం, (miscarriage) నవజాత శిశుమరణాల(stillbirth) ముప్పు ఎక్కువగా ఉందని తేలింది

Published By: HashtagU Telugu Desk
Pregnancy

Pregnancy

ప్రత్యేకించి కొన్ని వృత్తులలో పనిచేసే మహిళలకు గర్భస్రావం, (miscarriage) నవజాత శిశుమరణాల(stillbirth) ముప్పు ఎక్కువగా ఉందని తేలింది.దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని నేషనల్ మెడికల్ సెంటర్‌ శాస్త్రవేత్తల స్టడీలో ఈవిషయం వెల్లడైంది. 2010-2019 సంవత్సరాల మధ్యకాలానికి సంబంధించిన 18 లక్షలకుపైగా జాబ్స్ ఉన్న, జాబ్స్ లేని గర్భిణీ స్త్రీల సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. కొన్ని వృత్తులు మహిళలకు గర్భస్రావం, ప్రసవానికి సంబంధించిన ముప్పును సృష్టిస్తున్నాయని ఈ అధ్యయనంలో గుర్తించారు.

రిస్కును సృష్టిస్తున్న వృత్తుల జాబితాలో మ్యాను ఫ్యాక్చరింగ్, హోల్ సేల్ ట్రేడింగ్, రిటైల్ ట్రేడింగ్, ఎడ్యుకేషన్ కూడా ఉండటం గమనార్హం.( molar pregnancy “ఆక్యు పేషనల్ హెల్త్ ” జర్నల్‌లో ఈ స్టడీ రిపోర్ట్ పబ్లిష్ అయింది. ఈ వృత్తుల్లో పనిచేసిన మహిళల్లో మూడు ప్రతికూల ఫలితాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆవేమిటంటే.. గర్భంలోనే శిశువు చనిపోవడం (39.8 శాతం), డెలివరీ టైంలో లేదా డెలివరీ కి ముందు శిశువు చనిపోవడం(0.7 శాతం), గర్భ స్రావం (18 శాతం) జరగడం. ఉద్యోగాలు చేసే స్త్రీలతో పోలిస్తే ఉద్యోగాలు చేయని మహిళల్లో ముందస్తు గర్భస్రావ ఫలితాలు , ముందస్తు ప్రసవాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉందని స్టడీలో గుర్తించారు. ఉద్యోగాలు చేసే మహిళలతో పోలిస్తే ఉద్యోగాలు చేయని మహిళలకు గర్భ స్రావం, గర్భస్థ శిశువు చనిపోయే ముప్పు ఉందని తెలిపారు.

ఉద్యోగాలు చేసే మహిళలకు ఆకస్మిక డెలివరీ ముప్పు ఎక్కువగా ఉందని చెప్పారు.”శుభవార్త ఏమిటంటే.. దక్షిణ కొరియా యొక్క ఉపాధి, కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు గర్భిణీ స్త్రీలలోని అన్ని గర్భస్రావ ఫలితాలను కవర్ చేయడానికి పారిశ్రామిక ప్రమాద పరిహార బీమా చట్టాన్ని సవరిస్తోంది. ప్రతికూల గర్భధారణ ఫలితాలపై వృత్తిపరమైన వాతావరణం ప్రభావం ఉంది అనేది విస్పష్టం ” అని సియోల్‌లోని నేషనల్ మెడికల్ సెంటర్‌కు చెందిన రచయిత జంగ్-వాన్ యూన్ వివరించారు.

  Last Updated: 28 Jan 2023, 11:00 AM IST