Site icon HashtagU Telugu

Handgrip: చేతికి ఆ మాత్రం శక్తి లేకపోతే మీ ఒంట్లో రోగాలు ఉన్నట్టే.. సరికొత్త అధ్యనం?

Handgrip Strength

Handgrip Strength

మామూలుగా అనారోగ్యంగా ఉంటే వెంటనే చెకప్ లు చేసుకొని ఆ సమస్య ఏంటో తెలుసుకుంటాం. కానీ తాజాగా ఎటువంటి చెకప్ లేకుండా కేవలం చేతి పట్టు ద్వారా ఆ అనారోగ్య సమస్య ఏంటో తెలుసుకోవచ్చు అని తాజాగా బీఎంజే ఓపెన్ జర్నల్ అధ్యయనంలో తేలింది. అదేంటంటే చేతి పట్టు పరిశీలిస్తే చేతిపట్టు బలం వారి ఆరోగ్య స్థితిని తెలియజేస్తుందట.

నిజానికి కొందరు పచ్చళ్ళ సీసా మూతను కూడా తీయలేని పరిస్థితిలో ఉంటారు.అంతేకాకుండా నిండా సరుకులు ఉన్న సంచిని కూడా మూయలేరు. అంటే హ్యాండ్ గ్రిప్ తక్కువగా ఉంటే అంతర్గతంగా ఉన్న ఆరోగ్య సమస్యలకు నిదర్శమని పరిశోధకులు తెలుపుతున్నారు.

ఇటువంటి సమస్యలు పెద్దవాళ్ళకే కాకుండా చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది అని తెలియజేశారు. ఇక గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని చేతి పట్టు ప్రతిఫలిస్తుంది అని తెలిపారు. చేతిపట్టు తక్కువగా ఉన్న వారికి ఆయుర్థాయం కూడా తక్కువగా ఉంటుంది అని అన్నారు. చేతి పట్టుబలం ఒక వ్యక్తి వయసు, ఎత్తు పై ఆధారపడి ఉంటుందని అన్నారు.

చేతిపట్టు ఏ స్థాయికి తక్కువగా ఉన్న రోగులను పరీక్షల కోసం ప్రాక్టీషనర్లు పంపించాలో అనేది తెలుసుకోవడమే తమ అధ్యాయ ఉద్దేశమట. బీపీ మాదిరిగా హ్యాండ్ గ్రిప్ బలానికి కూడా పరిమితులు నిర్దేశించడం కూడా దీని అర్థం అని తెలుస్తుందని.. ఇక హ్యాండ్ గ్రిప్ పరీక్ష సులభమైనదని.. ఆరోగ్య సమస్యలను, అంతర్గతంగా ఉన్న సమస్యలను ముందుగానే గుర్తించడానికి ఇది బాగా సహాయపడుతుందని అన్నారు.