C Section Delievry : మీది సిజేరియన్ ప్రసవమా..? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి…లేదంటే ఆరోగ్యానికే ప్రమాదం..!!

ఈమధ్య కాలంలో సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్ ప్రసవాలే ఎక్కువగా జరుగుతున్నాయి. సిజేరియన్ డెలివరీ...సాధారణ డెలివరీ కంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 02:00 PM IST

ఈమధ్య కాలంలో సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్ ప్రసవాలే ఎక్కువగా జరుగుతున్నాయి. సిజేరియన్ డెలివరీ…సాధారణ డెలివరీ కంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంత తొందరగా కోలుకోలేకపోతారు. సిజేరియన్ డెలివరీకి సాధారణంగా కొంచెం ఎక్కువ జాగ్రత్త అవసరం. కాబట్టి, సిజేరియన్ డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

భయపడవద్దు:
సిజేరియన్ డెలివరీ తర్వాత, మహిళలు తరచుగా కొన్ని రోజులు మంచానికే పరిమితం అవుతారు. లేచి నడుస్తుంటే కుట్లు ఊడుతాయన్న భయం వారిని వెంటాడుతుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకసారి భయపడితే, అది చాలా కాలం పాటు వెంటాడుతుంది. కాబట్టి లేచి మెళ్లిగా నడవడం…తోచిన పనిచేసుకోవడం మంచిదని చెబుతున్నారు.

ప్రసవానంతర కుట్లు:
సిజేరియన్ ద్వారా మహిళలకు పొత్తి కడుపులో కుట్లు వేస్తారు. మీరు ఇంటికి వచ్చాక ఆ గాయం మానిపోయే వరకు జాగ్రత్తగా ఉండండి. చల్లటి నీటిలో ఎక్కువ పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

రక్తస్రావం:
బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు రక్తస్రావం జరుగుతుంది. మీరు మంచి విశ్రాంతి తీసుకుంటే రక్తస్రావం తగ్గుతుంది. త్వరగా ఆగిపోతుంది. ఎక్కువ శ్రమ అవసరమయ్యే పనులు చేయకండి. మొదటి వారం చాలావరకు విశ్రాంతి తీసుకోండి.

నీటి వినియోగం:
సిజేరియన్ డెలివరీ తర్వాత త్వరగా కోలుకోవడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. అదనంగా, శరీరం నీరు అధికంగా ఉండే కూరగాయలు పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. డెలివరీ తర్వాత మలబద్ధకాన్ని నివారించడం కూడా చాలా ముఖ్యం. అయితే చల్లటి నీరు తాగకూడదు. వీలైనంత ఎక్కువ వేడి లేదా గోరువెచ్చని నీరు త్రాగాలి. అలాగే మీ శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోండి.

ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి:
సిజేరియన్ తర్వాత జ్వరం,శరీర నొప్పులు కొన్ని రోజులు కొనసాగవచ్చు. అటువంటి సందర్భాలలో సరైన సలహా కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది. సిజేరియన్ డెలివరీ తర్వాత బిడ్డ, తల్లి ఇద్దరూ కోలుకోవడానికి ఎక్కువ సమయం కావాలి. అలాగే సిజేరియన్‌లో కుట్లే వేస్తారు కాబట్టి కొన్ని రోజుల పాటు ఉండడంతో భార్యభర్తలు లైంగిక సంబంధానికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.