Site icon HashtagU Telugu

‎Mouth Ulcers: తరచూ నోటి పూత సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే!

Mouth Ulcers

Mouth Ulcers

Mouth Ulcers: కొంతమందికి సీజన్ తో సంబంధం లేకుండా నోటిపూత సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ నోటి పూత సమస్య ఎక్కువగా నాలుక పెదవుల భాగంలో వస్తూ ఉంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ఏదైనా తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొద్దిగా వారం ఉన్న పదార్థాలు వేడిగా ఉన్న పదార్థాలు తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నోటి పూత సమస్య వచ్చినప్పుడు టాబ్లెట్స్ లేదంటే ఆయింట్మెంట్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ నోటి పూత సమస్య మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎జీర్ణక్రియ సరిగా లేకపోవడం, విటమిన్ బి12, ఐరన్ లేదా ఫోలిక్ యాసిడ్ లోపాలు, శరీర వేడి పెరగడం, ఒత్తిడి, కారంగా లేదా పుల్లగా ఉండే ఆహారాలు తినడం, ధూమపానం, నిద్ర లేకపోవడం కారణంగా ఈ నోటి పూత సమస్య వస్తుంది. కొన్నిసార్లు, సరిగ్గా బ్రెస్ చేయకపోవడం కూడా నోటి పూతలకు కారణం కావచ్చట. అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. నోటి పూతల నుండి ఉపశమనం పొందడానికి కలబంద అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందట. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని తాగితే మీ శరీరంలోపి వేడి తగ్గుతుందట. జీర్ణక్రియ మెరుగుపడుతుందని అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.

‎ కలబంద జెల్‌ ను నేరుగా పుండుకు పూయడం వల్ల మంట, నొప్పి, వాపు నుండి కూడా తక్షణ ఉపశమనం లభిస్తుందట.  అదనంగా, శరీరాన్ని చల్లగా ఉంచడానికి పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి చల్లని ఆహారాలు తీసుకోవాలట. కారంగా, వేయించిన, అధికంగా పుల్లగా ఉండే ఆహారాల జోలికి అస్సలు వెళ్లకూడదట. దీనితో పాటు మీరు రోజూ మీ శరీరానికి అవసరమైనంత నీరు త్రాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయడం వల్ల కూడా నోటి పూతల సమస్యను తగ్గించుకోవచ్చట.

‎ఒత్తిడిని తగ్గించడం, సరిగ్గా నిద్రపోవడం కూడా చాలా అవసరం, ఎందుకంటే ఒత్తిడి, నిద్ర లేకపోవడం కారణంగా ఈ సమస్య మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందట. నోటి పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవాలట. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలట. పుల్లని పండ్లు, వేడి ఆహారాన్ని తినడం మానుకోవాలట. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ధూమపానం, మద్యం, పొగాకుకు పూర్తిగా దూరంగా ఉండాలట. ఒకవేళ
‎బొబ్బలు ఎక్కువ కాలం కొనసాగితే, వైద్యుడిని సంప్రదించడం మంచిదట.
‎‎

Exit mobile version