Site icon HashtagU Telugu

Relationship Tips: సంతానం కలగటానికి అద్భుతమైన పరిష్కారం.. ఈ సమయంలో కలిస్తే నెల తప్పడం ఖాయం?

Rl

Rl

Relationship Tips: పెళ్లయిన దంపతులు ప్రతి ఒక్కరు పిల్లలను కణాలని ఆత్రుత పడుతూ ఉంటారు. దాంతో వాళ్ళు ఎన్నిసార్లు పిల్లల గురించి ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోతుంది. అంతేకాకుండా కొంతమందికి ఏ సమయంలో కలవాలన్న అవగాహన లేకపోవడంతో కూడా పిల్లలు పుట్టడంలో మరింత ఆలస్యం అవుతుంది. కాబట్టి అటువంటి వారికి ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ను ఫాలో అవుతే రెండు నెలల్లో నెల తప్పడం ఖాయం. ఇంతకు అదేంటంటే..

ముఖ్యంగా ఆడవారికి నెలసరి అనేది కరెక్ట్ గా ఉండాలి. ఆ నెలసరి అనేది గర్భానికి ముడిపడి ఉంటుంది. నెలసరి తర్వాత అండం విడుదల కావడం ఆ సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల వెంటనే గర్భవతి అవుతారు. మరి ఆ అండం ఎప్పుడు విడుదలవుతుంది.. ఆ సమయంలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

మాములుగా 28 రోజులు ఋతుచక్రం కలిగిన వాళ్లకు కరెక్ట్ పీరియడ్స్ వచ్చిన మొదటి రోజు నుంచి 14 రోజులలోపు అండం విడుదలవుతుంది. అంటే పీరియడ్స్ అయిపోయిన ఐదు రోజుల నుండి దాదాపు 17 రోజుల వరకు శృంగారంలో పాల్గొనడం వల్ల గర్భాన్ని దాల్చావచ్చు. అయితే అండం విడుదల అయిందని ఎలా తెలుసుకోవచ్చు అంటే.. ఈ మధ్యకాలంలో ఓబులేషన్ కిట్ అనేది అందుబాటులో ఉంది.

దాని ద్వారా కూడా అండం ఎప్పుడు విడుదలవుతుంది అనేది తెలుసుకోవచ్చు. అలా కాకుండా కొన్ని లక్షణాల ద్వారా కూడా సులువుగా తెలుసుకోవచ్చు. అదేంటంటే వక్షోజాలు లావుగా మారి కాస్త వాసినట్లుగా అనిపిస్తుంది. అంతే కాకుండా కాస్త నొప్పి కూడా ఉంటుంది. ఆ సమయంలో శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనాలి అని అనిపిస్తుంది. ఇక యోని నుంచి చిక్కటి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అంతేకాకుండా పొత్తికడుపులో కాస్త నొప్పి కూడా ఉంటుంది. ఆ సమయంలో యోని నుండి ఒక రకమైన వాసన కూడా వస్తుంది. కాబట్టి ఈ లక్షణాలని మీరు గమనించినట్లయితే మీరు వెంటనే గర్భవతి కావచ్చు.

Exit mobile version