Fruits: పరగడుపున ఈ పండ్లను తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 10:00 AM IST

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి అన్న విషయం తెలిసిందే. వైద్యులు కూడా తరచూ తాజా పండ్లను తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సీజనల్ ప్రకారంగా లభించే పండ్లను తప్పకుండా తినాలని చెబుతూ ఉంటారు. ఇకపోతే చాలామందికి పండ్లను ఎప్పుడు తినాలి? ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తినాలి అన్న విషయాలు తెలియదు. అందులో కొందరు నిద్ర లేచిన తర్వాత అంటే పరగడుపున పండ్లను తీసుకుంటు ఉంటారు. కానీ అలా తీసుకోకూడదు. కడుపులో ఏది పడకుండా పండ్ల ముక్కలు తింటే పొట్టలో ప్రమాదకరమైన రసాయనాలకు అది దారితీస్తుంది.

ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఏదైనా పండ్లు తీసుకుంటే అదే ప్రమాదకరం. కానీ ఇప్పుడు పొట్టలో ఏమీ లేకుండా ఆహారంగా పండ్లు తీసుకుంటేనే మంచితనం కూడా అంటున్నారు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే పండ్లు తినడం మంచిదని కొందరు వైద్యులు చెబుతున్నారు.. ఆహారంతో కడుపు నింపేసిన తర్వాత కంటే ఖాళీ కడుపుతో తినడం వలన ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. శరీరంలో నుంచి మలినాలు తొలగించే కార్యక్రమంలో పండ్లు కీలకమైన పాత్రను పోషిస్తాయి. పండ్లను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవడం వలన కేసాల రంగు వెలసిపోదు. జుట్టు రాలడం తగ్గుతుంది.

కళ్ళ చుట్టూ నల్లటి చారికలు ఒత్తిడి ఉండదు. అలాగే పరగడుపున టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అయితే మాత్రలు వేసుకున్న తర్వాత పండ్లను తీసుకుంటే ఆ మాత్రను ప్రభావం బాగా తగ్గిపోతుంది. మాత్రలను మంచినీళ్లతో తప్ప మజ్జిగతో కానీ పళ్ళ రసాలతో కానీ తీసుకుంటే నిష్ప్రయోజనకరం. కాబట్టి పండ్లను తినడం మంచిదే కానీ ఎప్పుడు తినాలి ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న విషయాలు మాత్రం గుర్తుంచుకోవాలి.