Reduce Pain: మందు లేకుండానే నొప్పిని తగ్గించే పనికరం.. ఈ వివరాలు తెలుసుకోండి!

సాధారణంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వచ్చినప్పుడు చాలామంది ఆ నొప్పితో ఆ అల్లాడిపోతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 06:00 AM IST

సాధారణంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వచ్చినప్పుడు చాలామంది ఆ నొప్పితో ఆ అల్లాడిపోతూ ఉంటారు. ఆ నొప్పి తగ్గే వరకు పనిచేయలేము అదేవిధంగా సరిగ్గా కంటిమీద నిద్ర కూడా రాదు. అయితే వయసు రీత్యా వచ్చే నొప్పులతో పాటుగా, చిన్న చిన్న ప్రమాదాలు తగిలినప్పుడు వచ్చే నొప్పులు తగ్గాలంటే తప్పకుండా మందులు వాడాల్సిందే. అయితే మందులను కూడా అధికంగా వాడటం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. కానీ ఎటువంటి మందులు అవసరం లేకుండా నొప్పిని తగ్గించే ఒక సరికొత్త పరికరాన్ని అమెరికా ఇల్లినాయిస్ లోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు.

నొప్పి ఉన్న ప్రదేశంలో ఆ డివైజ్ ను ఒక క్రమ పద్ధతిలో ప్యాచ్ లా అతికించడం వల్ల ఆ నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అయితే ఆ డివైజ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మనకు దెబ్బ తగిలినప్పుడు లేదా నొప్పి వచ్చినప్పుడు ఆ శరీర భాగాల్లో నాడులు స్పందించి వెంటనే మెదుడుకు సంకేతాలు పంపుతూ ఉంటాయి. దీనితో ఆయా భాగాల్లో నొప్పి ఉన్న అనుభూతిని కలుగుతుంది. తాజాగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పరికరం మన చర్మం దిగువన ఉండ కండరాల్లో నాడులను చల్లబరచడం ద్వారా వాటి నుంచి మెదడుకు వెళ్లే సంకేతాలను నియంత్రిస్తుంది.

దీంతో ఆ నాడి తాత్కాలికంగా మొద్దు బారినట్టు అవుతుంది. అప్పుడు నొప్పి ఉన్న అనుభూతి ఉండదు అనే పరిశోధనకు నేతృత్వం వహించిన ఆ శాస్త్రవేత్త జాన్ రోజర్స్ తెలిపారు. అయితే ఇదే విషయంపై ఎలుకలపై ప్రయోగాలు జరపగా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. దీన్ని ఎలా తయారు చేశారంటే.. రెండు మిల్లీమీటర్ల వెడల్పుతో పట్టి లా ఉండే ఈ పరికరంలో అత్యంత సన్నని గొట్టాల వంటి సూక్ష్మణాళికలు ఉంటాయి. దీనికి అనుసంధానించిన పంపు ద్వారా చల్లబరిచిన ఫర్ ఫ్లోరో పెంటేన్ అనే రసాయనాన్ని నైట్రోజన్ కు పంపుతారు.

ఈ ద్రవాలు సూక్ష్మణాళికల ద్వారా ప్రయాణించినాడులను చల్ల బరుస్తాయి. అంతేకాకుండా ఈ పరికరాన్ని సహజసిద్ధంగా డీకంపోజ్ అయ్యే పదార్థంతో తయారు చేశారు. మెత్తగా నొప్పి కలిగిన ప్రాంతంలో అమర్చి ఎందుకు ఇది వీలుగా ఉంటుంది. కాకుండా నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. కానీ నొప్పి పూర్తిగా తగ్గిపోవాలి అంటే మాత్రం తగిన చికిత్స అవసరం అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు