Site icon HashtagU Telugu

Red Ladies Finger : ఎర్ర బెండకాయల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే వాటిని తినకుండా అసలు ఉండలేరు?

91s34 Ceqll. Ac Uf1000,1000 Ql80

91s34 Ceqll. Ac Uf1000,1000 Ql80

మామూలుగా మనకు మార్కెట్లో ఆకుపచ్చ రంగులో ఉంటే బెండకాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ బెండకాయల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది బెండకాయను తినడానికి అసలు ఇష్టపడరు. మీకు తెలుసా ఆకుపచ్చ బెండకాయలు మాత్రమే కాకుండా ఎర్ర రంగు బెండకాయలు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటి ఎర్ర రంగు బెండకాయల అని ఆశ్చర్యపోతున్నా? ఇవి మనకు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎరుపు రంగు బెండకాయల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

మరి ఎరుపు రంగు బెండు కాయల వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా బెండకాయలో చాలా పోషకాలు ఉంటాయి. బెండకాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే బెండకాయను మనం ఎక్కువగా తింటుంటాం. మామూలుగా చాలామంది తినేది ఆకు పచ్చ రంగులో ఉండే బెండకాయలను. కానీ.. వరంగల్ జిల్లాకు చెందిన ఒక రైతు మాత్రం ఈ బెండకాయలకు ప్రస్తుతం మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ బెండకాయల్లో ప్రస్తుతం మార్కెట్ లో దొరికే గ్రీన్ బెండకాయల కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి.

నిజానికి ఈ బెండకాయలు ఎక్కువగా చలి ఉన్న ప్రాంతాల్లో పండుతాయి. అక్కడే ఇవి సాగుకు అనుకూలం. వీటికి ఎండ తాకితే కాయవు. అయితే వీటికి ఎండ తాకకుండా అవి పెరగడానికి అనుగుణంగా వాతావరణాన్ని సృష్టించి తెలంగాణ వైపు ఎక్కువగాసాగు చేస్తున్నారు. ఈ బెండకాయలో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా మీరు మార్కెట్ కి వెళ్తే ఎర్ర బెండకాయలు కనిపిస్తే అసలు వదలకండి.