Site icon HashtagU Telugu

Guava: చలికాలంలో జామపండు తప్పనిసరిగా తినాలంటున్న వైద్యులు.. ఎందుకంటే?

Guava In Winter

Guava In Winter

సాధారణంగా కొన్ని సీజన్లలో మనకు కొన్ని పండ్లు మాత్రమే దొరుకుతూ ఉంటాయి. అలాంటి వాటిలో జామకాయ కూడా ఒకటి. జామపండ్లను పేదవాడి యాపిల్ అని కూడా పిలుస్తారు. ఈ పండులో చక్కెరలు విటమిన్లు ఖనిజాలు సమృద్దిగా లభిస్తాయి. జామపండును తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. జామపండు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా కడుపుకు సంబంధించిన ఎన్నో సమస్యలను జామకాయ దూరం చేస్తుంది. యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు కలిగిన పండు జామ పండు. ఒక జామపండు 9 యాపిల్స్‌తో సమానమైన పోషకాలు ఉంటాయి. రోజూ యాపిల్‌కు బదులు జామపండు తింటే శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

జామ పండు లోపల మాత్రమే కాదు బయట కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది అనేక ముఖ్యమైన ఆరోగ్య సమస్యలకు మంచిది. జామపండ్లు ఆరోగ్యానికీ అధిక లాభాన్ని చేకూరుస్తాయి. ఈ పండ్ల ముక్కలపై మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తింటే ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తాయి. కానీ ఎవరికి నచ్చిన విధంగా వారు వీటిని తింటూ ఉంటారు. వీటితో జామ్‌ లు ఐస్‌క్రీమ్స్ సలాడ్స్ వంటివి తయారు చేసుకోవచ్చు. జామపళ్ళలో సి విటమిన్ పుష్కలంగా వుంటుంది. అనారోగ్యాన్ని దరిచేరనీయని జామ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాగా విటమిన్‌ సి ఎక్కుగా దొరికే వాటిలో ఉసిరికాయలకు ధీటుగా జామను చెప్పుకోవచ్చు. కమలా పండు కన్నా ఇందులో ఐదు రెట్లు ఇందులో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది.

ఇందులో నిమ్మ, నారింజలలో కంటే నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా వుంటుంది. కానీ చాలా మంది చలికాలంలో జామపండు తినకుండా ఉంటారు. దీనికి కారణం జామపండు తింటే జలుబు చేస్తుంది. అయితే జామ పండులో పీచు, విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజూ ఒక్క జామ పండును చలికాలంలోనే కాదు. ప్రస్తుతం చాలా మంది వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. జామపండులో మినరల్స్‌తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ప్రధానంగా ఇందులో ఉండే విటమిన్ బి బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. జామకాయ ఈ సమస్యకు ముగింపు పలకడానికి సహాయపడుతుంది. ఎందుకంటే జామలోని గింజలు బలమైన భేదిమందుగా పనిచేస్తాయి డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి మీకు మలబద్ధకం సమస్య ఉంటే, రోజూ ఒక జామ పండు తినండి. దీని వల్ల గ్యాస్ట్రైటిస్ క్రమబద్ధమై మలబద్ధకం సమస్య దూరమవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ ఉత్తమ పండు. ఎందుకంటే జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అదనంగా, జామ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.