Site icon HashtagU Telugu

Sabja Seeds: సమ్మర్ లో సబ్జా గింజలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Sabja Seeds

Sabja Seeds

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10:00 అయింది అంటే చాలు ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే భయపడుతున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే ప్రధాన రహదారులు సైతం మనుషులు లేక ఖాళీగా ఉంటున్నాయి. వాహనదారులు కూడా బయటకు రావాలి అంటేనే భయపడుతున్నారు. దాంతో ఒంట్లో వేడి కూడా పెరిగిపోతుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు, శీతల పానీయాలు, కొబ్బరి బోండాలు, లెమన్‌ వాటర్‌, పుదీనా నీరు, మజ్జిగ వంటివి తరచూగా తీసుకుంటుంటారు. అయితే, వేసవిలో చలువ చేసే మరో పదార్థం కూడా ఉంది. అదే సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, ఎక్కువ మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో కలకండా వేసుకుని తాగేవారు.

ఇప్పుడు చాలా మంది దాన్ని మరిపోయారు. కానీ ఈ వేసవిలో మన ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు చేస్తుంది. ప్రస్తుతం రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో మన శరీరానికి హైడ్రేటెడ్ గా, చల్లగా ఉండాల్సిన అవసరం కూడా పెరుగుతోంది. వేసవిలో మన ఆరోగ్యం, శరీరం హైడ్రేటింగ్ యాంటీ ఆక్సిడెంట్-రిచ్ సీజనల్ పండ్లను తీసుకోవడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన కొన్ని విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. అటువంటి విత్తనం సబ్జా లేదా తులసి గింజలు, వీటిని సాధారణంగా ఫలూడా గింజలు అని పిలుస్తారు. ఈ విత్తనాల్లో ప్రోటీన్లు, కీలకమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉన్నాయట . ఇది మాత్రమే కాకుండా సబ్జా గింజల్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ చియా విత్తనాల కంటే ఎక్కువగా ఉంటుంది.

క్యాలరీలు లేని కారణంగా వాటిని ఆసియన్ సూపర్‌ ఫుడ్ గా కూడా పరిగణిస్తున్నారు. ఈ గింజల్లో పీచు, శ్లేష్మం పుష్కలంగా ఉన్నందున, అవి మలబద్ధకాన్ని తగ్గించడంలో ప్రేగు కదలికను ప్రోత్సహించడం, సంతృప్తిని కలిగించడం, మూత్రవిసర్జన మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడం, పిండిని రక్తంలో చక్కెరగా మార్చడం ద్వారా బరువు తగ్గడంలో చాలా సహాయకారిగా పనిచేస్తాయి. సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి. ఫలితంగా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

Exit mobile version