ఇదివరకటి రోజుల్లో మన పెద్దలు పండుగ సమయాలలో ఆహారం తినడానికి అలాగే మామూలు సమయాలలో కూడా ఆహారం తినడానికి అరటి ఆకులను ఎక్కువగా వినియోగించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో అరటి ఆకులో భోజనం చేసే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందని చెప్పవచ్చు. కేవలం కొన్ని కొన్ని పెళ్లిళ్లలో అలాగే కొన్ని రెస్టారెంట్ లలో మాత్రమే అరటి ఆకులను వినియోగిస్తున్నారు. అయితే అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు. మామూలు సమయాలలో కాకపోయినా కనీసం పండుగ సమయాలలో అయినా అరటి ఆకులో భోజనం చేయమని చెబుతున్నారు.
మరి అరటి ఆకులో భోజనం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటి ఆకులో వ్యాధి నిరోధక గుణాలు వల్ల సూక్ష్మజీవులు నాశనమవుతాయి. అరటి ఆకులో సహజ సిద్ధమైన కర్బన సమ్మేళనాలు ఉంటాయి. అరటి ఆకులో భోజనం చేయటం వల్ల సహజమైన కర్బన సమ్మేళనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి కేన్సర్, గుండె జబ్బులను నిరోధిస్తాయి. అలాగే అరటి ఆకులో తినటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. నేచురల్ యాంటీ ఆక్సిడెట్స్ గా కూడా పనిచేస్తాయి. ఆరటి ఆకుపై మైనపు పూత ఉంటుంది. వేడి ఆహార పదార్థాలు వడ్డించినప్పుడు ఈ మైనపు పూత కరిగి మంచి సువాసన వెదజల్లుతుంది. అదేవిధంగా అరటి ఆకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అజీర్తి, గ్యాస్, అల్సర్స్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.
అరటి ఆకుల రసం మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇది బరువు తగ్గేందుకు కూడా దోహదం చేస్తుంది. అరటి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అరటి ఆకులో ఆహారం వడించుకుని తినటం వల్ల గుండెకు కూడా మేలు చేస్తుంది. అరటి ఆకులు రక్తపోటును తగ్గించి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అరటి ఆకుల రసం జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుందట. అంతేకాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. అరటి ఆకుల పేస్ట్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అరటి ఆకుల్లో తినటం వల్ల ఇందులో ఉండే పాలీపెనాల్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్‌ను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరిచి పోషకాలను మెరుగ్గా గ్రహించేలా చేస్తాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి అనారోగ్యాల బారి నుంచి రక్షిస్తాయి. పార్కిన్సన్ వ్యాధికి చికిత్స చేయగల ఎంజైమ్ పాలీఫెనాల్ ఆక్సిడేస్ అరటి ఆకుల్లో ఉంటుంది.
note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.