Site icon HashtagU Telugu

Tea Disadvantages : టీ శృతిమించి తాగుతున్నారా.. అయితే జాగ్రత్త?

Tea Disadvantages

Tea Disadvantages

ప్రస్తుత రోజుల్లో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది టీ తాగేవారు ఉంటారు. ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా టీ తాగకపోతే ఆ రోజంతా కూడా ఏదో కోల్పోయిన వారిలా ఫీలవుతూ ఉంటారు. కొంతమంది గ్రీన్ టీ తాగితే మరి కొంతమంది కాఫీ బ్లాక్ టీ, నార్మల్ టీ తాగుతూ ఉంటారు. అయితే చాలామంది ప్రతిరోజు కనీసం నాలుగైదు సార్లు కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఆఫీసు పని చేసేవారు టెన్షన్ నుంచి రిలీఫ్ అవ్వడం కోసం టీనే ఎక్కువగా తాగుతూ ఉంటారు. టీ అతిగా సేవించడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. టీని శృతి మించి తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టీ తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌లో బాడీలో ఐరన్‌ని గ్రహించకుండా చేస్తుంది. జర్నల్ ఫుడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్‌లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం.. టీలో టానిన్లు అని పిలిచే సమ్మేళనాలకి గొప్ప మూలం. మీ జీర్ణవ్యవస్థని ఎఫెక్ట్ చేస్తుంది. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత దారితీస్తుంది. సాధారణంగా టీలో కొన్ని టానిన్లు కొన్ని పోషకాలను శరీరాన్ని గ్రహించడాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. దీని వల్ల ఆందోళన, నిద్ర సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలొస్తాయి. వీటితో పాటు మరి కొన్ని సమస్యలు కూడా వస్తాయి. కెఫిన్ ఎక్కువగా ఉన్న టీ తాగితే గర్బధారణ సమయంలో సమస్యలు వస్తాయి. ఇది గర్భస్రావం నుండి బరువు తగ్గడం వంటి సమస్యలకి కారణమవతుుంది.

కెఫిన్ ఉన్న టీ తీసుకుంటే గుండెల్లో మంట సమస్యకి కారణమవుతుంది. కెఫీన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంటకి కారణమవుతుంది. కాబట్టి, ఎక్కువగా తాగకపోవడమే మంచిది. టీలో సహజంగా కెఫిన్ ఉంటుంది. టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు నిద్ర సమస్యలొస్తాయి. కెఫిన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలటోనిన్ అనేది మీ మెదడకు నిద్ర పోయేందుకు హెల్ప్ చేసే హార్మోన్. కాబట్టి.. ఎక్కువగా తాగడం వల్ల నిద్ర సమస్యలొస్తాయి. దీని వల్ల మానసిక, శారీరక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి, రోజుకి 2 నుంచి 3 కప్పుల కంటే ఎక్కువగా టీ తాగకూడదు. .